సంక్రాంతి సందర్భంగా విడుదలయ్యే భారీ సినిమాలివే..?
కాగా 2022 సంక్రాంతి సమరం ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. దీన్ని థర్డ్ వేవ్ డిసైడ్ చేస్తుందని ఇప్పటికే చాలామంది అంచనా వేస్తున్నారని తెలుస్తోంది. ఇంకోవైపు ఇప్పటికే రిలీజ్ కి రావాల్సిన క్రేజీ ప్రాజెక్టులు అన్ని రిలీజ్ డేట్లను లాక్ చేయలేక సతమతమవుతున్నాయిన సమాచారం. పెద్ద సినిమాలు అయిన ఆచార్య, అలాగే రాధే శ్యామ్, కెజిఎఫ్-2, బన్నీ నటిస్తున్న పుష్పతో పాటే అఖండ లాంటి పెద్ద ప్రాజెక్టులు ఈ ఏడాది తెరమీదకు వచ్చే ఛాన్స్ ఉంది.
కాగా ఇందులో 2022 సంక్రాంతి బరిలో ఇప్పటికే ముగ్గురు పెద్ద హీరోలు నటించిన మూవీలు ఖాయమయ్యాయని తెలుస్తోంది. మహేష్ హీరోగా వస్తున్న సర్కారు వారి పాటతో పాటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అలాగే రానా హీరోలుగా చేస్తున్న అయ్యప్పనమ్ కోషియం మూవీ రీమేక్ కూడా సంక్రాంతికే వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈ మూవీకి సాగర్ చంద్ర దర్శకత్వం చేస్తున్నారు.
ఇక వీరితో పాటే వెంకటేష్ అలాగే మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి చేస్తున్న ఎఫ్ 3 మూవీ కూడా 2022 సంక్రాంతికే వచ్చే అవకాశం ఉంది. ఇది ఎఫ్-2కి సీక్వెల్ గా వస్తోంది. కొత్త ఎమోషనల్ స్టోరీతో ఎంటర్ టైనర్ గా దీన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి తీస్తున్నారని తెలిపారు. ఇంకోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ కూడా బ్యాక్ టు బ్యాక్ గా 4 సినిమాలు ప్రస్తుతం చేస్తున్నారు. ఇందులో ఏదో ఏదో ఒకటి వచ్చే సంక్రాంతికి రానున్నట్టు తెలుస్తోంది.