బాలీవుడ్ ఇండస్ట్రీకి ధీటుగా ఎదిగిన సౌత్ ఫిలిం ఇండస్ట్రీ..?
అయితే సౌత్ ఫిలిం ఇండస్ట్రీతో పోల్చుకుంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ సినిమాలు చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందుతున్నాయని స్పష్టమవుతోంది. త్వరలోనే ఎన్నో దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ కాబోతున్నాయి. కానీ ఒకటో రెండో తప్పించి దాదాపు అన్ని బాలీవుడ్ సినిమాలు కేవలం హిందీ లో మాత్రమే విడుదల అవుతున్నాయి. దక్షిణాది చిత్రాలకు భారీగా ప్రజాదరణ దక్కడంతో ప్రతీ స్టార్ హీరో సినిమా భారత దేశ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల అవుతున్నాయి. కరోనా పూర్తిగా తగ్గుముఖం పడితే.. వరుసగా భారీ సౌత్ చిత్రాలు విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ దెబ్బతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాలీవుడ్ ఎప్పటికీ చేరుకోలేని హై లెవెల్ కి చేరుకుంటుందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.
నిజానికి బాలీవుడ్ ప్రముఖులు సౌత్ ఫిలిం ఇండస్ట్రీ ని చాలా చులకనగా చూసేవారు. కానీ ఇప్పుడు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్నారు. దీన్నిబట్టి దక్షిణాది దర్శకులు బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఆధిపత్యం చెలాయిస్తున్నారు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. విశేషం ఏమిటంటే సౌత్ ఇండస్ట్రీ లో రూపొందే సినిమాలు హిందీలో డబ్ అయ్యి ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. సౌత్ సినిమాల్లో మంచి కథలతో పాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉండటంతో హిందీ అభిమానులు సినిమాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. హిందీ సినిమాలను చూడటం మానేసి దక్షిణాది సినిమాలు చూడటం బాగా అలవాటు చేసుకున్నారు. యూట్యూబ్ లో హిందీ భాషలో డబ్ కాబడిన సౌత్ సినిమాలకు ఎన్ని కోట్ల వ్యూస్ వస్తున్నాయో చూస్తే బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచి ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుంటే బాలీవుడ్ ఇండస్ట్రీకి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ధీటుగా ఎదిగిందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.