పవన్ 'పులి'ని అమ్మ కూడా కాపాడలేకపోయిందిగా!
* ఈ సినిమాలో ఎస్ జె సూర్య మూడు బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఈ సినిమాకు రచయితగా, డైరెక్టర్ గా వ్యవహరించాడు. అంతే కాకుండా హుస్సేన్ అనే పాత్రలో కనిపించి అలరించారు.
* పవన్ కళ్యాణ్ తన సినిమా చరిత్రలో మొదటి సారిగా పోలీసు ఆఫీసర్ గా నటించాడు.
* ఈ సినిమా విడుదలకు ముందు ఒక వివ్వడంలో చిక్కుకుంది. సినిమా టైటిల్ "కొమరం పులి" గా పెట్టడం వలన ఆది వాసీ వీరుడు కొమరం భీం మనువడు అభ్యంతరం తెలపడంతో ఈ సినిమా టైటిల్ ను పులి గా మార్చారు.
* ఈ సినిమాను నిర్మించిన గీతా ఆర్ట్స్ వారు ఎంతో నమ్మకంతో 1000 కి పైగా థియేటర్లలో విడుదల చేశారు. తెలుగు సినిమా చరిత్రలో మొదటి సినిమాగా రికార్డు సృష్టించింది.
* ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నీకేష్ పటేల్ హీరోయిన్ గా నటించింది. ఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ కొంతవరకు సినిమాను కాపాడిందని చెప్పవచ్చు.
* ఈ సినిమాలో ఉన్న డైలాగ్స్ కు మరియు పాత్రల తీరుకు పొంతన లేకుండా ఉంటుంది. డైలాగ్స్ కూడా చాల లౌడ్ గా ఇబ్బందికరంగా ఉండడం ఒక కారణం కావచ్చు.
* ఈ సినిమాలో చూపించిన దృశ్యాలలో గ్రాఫిక్స్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది.
* ఈ సినిమాలో సన్నివేశాల పరంగా ఫైట్స్ బాగున్నప్పటికీ, అవి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో విఫలం అయ్యాయని చెప్పాలి.
* ఇందులో పవన్ కళ్యాణ్ చెప్పిన పెద్ద డైలాగులు ప్రేక్షకుల ఓపికకు పరీక్ష పెడతాయి.
* ఇందులో విలన్ ఎక్స్ప్రెషన్స్ మరియు డైలుగులు బాగున్నా, పోకిరి సినిమాలోకి ఆశిష్ విద్యార్థి ని గుర్తుకు తెస్తాయి.
* ఎడిటింగ్ కు ఇంకాస్త పదును పెట్టి ఉంటే బాగుండేది. పవన్ కళ్యాణ్ ని అందంగా చూపించడానికి ట్రై చేసిన సినిమాటోగ్రాఫర్ కొద్దిగా మిగిలిన ఫ్రేమ్స్ ని కూడా కవర్ చేసి ఉండాల్సింది.
* మొత్తానికి ఎస్ జె సూర్య పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమాగా గుర్తుండిపోతుంది. సినిమా ప్లాట్ బాగున్నా తెరకెక్కించే విధానంలో పొరపాట్లు దొర్లాయి.
మంచి అమ్మ సెంటిమెంట్ తో తెరకెక్కిన పులి సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది.