"భూపతి" గుమ్మడికాయ కొట్టేశాడు.. రిలీజ్ ఎప్పుడంటే?

VAMSI
ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా "మహాసముద్రం" షూటింగును కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధమైంది. రొటీన్ సినిమాలకు భిన్నంగా మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కినట్లు ఇటీవల విడుదల చేసిన పోస్టర్ లను బట్టి అర్ధం అవుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు అజయ్ భూపతి ఒక మాట అన్నాడు. ఈ సినిమా నా డ్రీం ప్రాజెక్టు, ప్రతి ఒక్క పాత్రని ఎంతో జాగ్రత్తగా రాసుకున్నానని తెలిపాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో కనిపిస్తున్న శర్వానంద్ మరియు సిద్దార్ధ్ లు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అతి త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా షూటింగ్ కంప్లీట్ అయినంత మాత్రాన పని అయిపోలేదు. 

ఇప్పుడే అసలు పని మొదలు కానుంది. 
ఈ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ప్రమోషన్స్ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో నిర్మాత, మరియు డైరెక్టర్ ఇప్పటికే ప్రణాళికలను చేసుకున్నట్లుగా తెలుస్తోంది. రానున్న రెండు మూడు రోజుల్లోనే ప్రమోషన్స్ మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. ఇక సినిమా పరంగా చూస్తే మల్టీ స్టార్రర్ మూవీ కావడం వలన, అందులోనూ అజయ్ భూపతి డైరెక్టర్ కావడం వలన ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. కాగా ఈ సినిమా విజయం శర్వానంద్ కు చాలా ఇంపార్టెంట్, ఇది కనుక పరాజయం పాలయితే శర్వానంద్ కెరీర్ ప్రమాదంలో పడినట్లేనని సినిమా విశ్లేషకులు అనుకుంటున్నారు.
ఇది ఒక యాక్షన్ తో కూడిన ప్రేమకథగా తెరకెక్కింది. హృద్యమైన ప్రేమ సన్నివేశాలను తెరకెక్కించడంలో అజయ్ భూపతి అందె వేసిన చేయి. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చిత్రబృందం అనుకుంటున్నారు. ఈ సినిమాలో ఇతర పాత్రల్లో అనూ ఇమ్మానుయేల్, అదితి రావ్ హైదరీ, రావు రమేష్, జగపతి బాబు మరియు కెజిఎఫ్ విలన్ గరుడ రామ్ లు నటించారు. మరి ఈ సినిమా అంచనాలను అందుకుంటుందా ? కెరీర్ లో రెండవ సినిమా తీస్తున్న అజయ్ భూపతికి మరో హిట్ అందిస్తుందా ? కమ్ బ్యాక్ హీరో సిద్దార్ధ్ కు లైఫ్ ఇస్తుందా ? ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఈ సినిమా విడుదలయ్యే వరకు వెయిట్ చెయ్యాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: