సబ్‌కలెక్టర్‌గా దుమ్మురేపనున్న రవితేజ..?

Suma Kallamadi
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న అప్‌కమింగ్ సినిమాకి సంబంధించి హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక విలేజ్ సెట్స్ నిర్మించారు. రవితేజ కెరీర్ లో 68వ సినిమాగా వస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. డైరెక్టర్ శరత్‌ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాలో రవితేజ సరసన మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్ గా నటిస్తున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించి రెండో షెడ్యూల్ మరో 20 రోజుల పాటు జరగనుంది.

అయితే ఈ షెడ్యూల్ లో రవితేజ, దివ్యాంశ లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు అని సమాచారం. కొద్ది సంవత్సరాల క్రితం ఆంధ్ర ప్రదేశ్ లో చోటు చేసుకున్న వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కే ఈ సినిమాలో రవితేజ ఎమ్మార్వో గా కనిపించనున్నారని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ తాజా సమాచారం ప్రకారం రవితేజ సబ్‌కలెక్టర్‌గా దుమ్మురేపనున్నారని తెలుస్తోంది.

ఇటీవల మూవీ యూనిట్ రవితేజ 68వ సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం లో రవితేజ కూర్చొని ఏదో పని చేస్తున్నట్లు కనిపించింది. దీంతో ఎమ్మార్వో గా రవితేజ కనిపించనున్నారు అని అనేక వార్తలు వెల్లువెత్తాయి. కాగా లేటెస్ట్ నివేదికలు మాత్రం గతంలో వచ్చిన వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని స్పష్టం చేశాయి.  పోలీస్ పాత్రలలో నటించి మెప్పించిన రవితేజ సబ్‌కలెక్టర్‌గా కనిపించి మెప్పిస్తారో లేదో చూడాలి.

ఈ సినిమా రెండవ షెడ్యూల్ పూర్తి కాగానే రవితేజ రమేష్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ "ఖిలాడీ" సినిమా షూటింగ్ లో పాల్గొంటారు. ఈ మూవీ షూటింగ్ తుది దశలో ఉందని సమాచారం. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాలో విలన్ గా అర్జున్ కనిపించనున్నారు. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అనసూయ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి కాగానే ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో విడుదల కానుందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: