సినిమాల్లో రాణించాలంటే హీరోయిన్లు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. టాలెంట్, అదృష్టంతో పాటు వారు ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. కుటుంబానికి దూరంగా ఉంటూ సినిమాల్లో అవకాశాలు సాధించడం అంటే అంత మామూలు విషయం కాదు. స్టార్ హీరోల కూతుర్లు అయినా సినిమాల అవకాశాలు దక్కించకోవడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఆ విధంగా ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయిన చాలామది ఎంతో కష్టపడి టాప్ హీరోయిన్లుగా ఎదిగారు.
తమిళ నటి ఐశ్వర్య రాజేష్ కూడా హీరోయిన్ గా అవకాశం సంపాదించుకుంటు స్టార్ హీరోయిన్ అవడానికి సినిమాల్లో ఎంతో కష్టపడుతుంది. ఆమె స్వర్గీయ హీరో రాజేష్ కూతురిగా సినిమా పరిశ్రమలోకి వచ్చినా తనదైన గుర్తింపు దక్కించుకొని ప్రేక్షకులలో నటిగా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుని దూసుకుపోతుంది. తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి ఇ మరియు వరల్డ్ ఫేమస్ లవర్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు దక్కించుకొని ప్రస్తుతం రిపబ్లిక్, టక్ జగదీష్ వంటి సినిమాలలో నటిస్తుంది. ఈ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ఇవే కాకుండా పవన్ కళ్యాణ్ నటిస్తున్న రీమేక్ సినిమాలో కూడా ఛాన్స్ వచ్చింది. ఇటీవలే ఐశ్వర్య రాజేష్ తాను పడ్డ సినిమా కష్టాల గురించి చెప్పింది. తనకు ఎనిమిదేళ్ల వయసులో తండ్రి చనిపోయాడు. ఆ తర్వాత 10 ఏళ్ల వయసులో పెద్దన్నయ్య చనిపోయాడని రెండో అన్నయ్య రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు అని చెప్పింది. 15 ఏళ్ళ వయస్సులోనే కుటుంబ బాధ్యతలు మోయాల్సి వచ్చింది అని చెప్పారు. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం పెళ్లిళ్లకు యాంకరింగ్ కూడా చేశాను అని ఐశ్వర్య రాజేష్ చెప్పారు. హీరోయిన్ అవడానికి తాను ఎంతో కష్టపడ్డానని, ఇప్పుడు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయని తన తండ్రి పేరును తప్పకుండా నిలబడతానని ఐశ్వర్య రాజేష్ వెల్లడించారు. అంతేకాకుండా ఆమె భవిష్యత్ లో తన అభిమానులు గర్వపడే సినిమాలు చేస్తానని చెప్పింది.