టాలీవుడ్ లో మెగా స్టార్ చిరంజీవికి ఉన్న పేరు ప్రఖ్యాతలు అన్ని ఇన్ని కావు. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఒంటరిగా సినిమా ఇండస్ట్రీ లోకి ప్రవేశించి ఆయన ఎదిగిన తీరు అసామాన్యం. ఎంతో మందికి స్పూర్తి కలిగించిన చిరంజీవి ప్రయాణం ఇంకెంతో మంది ఇండస్ట్రీకి రావడానికి కారణం అయ్యింది. అప్పటికే ఎన్టీఆర్ ఏఎన్నార్ కృష్ణ కృష్ణంరాజు వంటి వారు రాజ్యమేలుతున్న సమయంలో ఎలాంటి సపోర్ట్ లేకుండా సినిమాలలోకి వచ్చి చిన్న చిన్న వేషాలు , పాత్రలు చేస్తూ హీరోగా సెటిల్ అయ్యాడు.
ఆ తర్వాత ఇండస్ట్రీ హిట్ సినిమాలను చేసి మెగాస్టార్ అయ్యాడు. అప్పటినుంచి ఆయన ప్రభంజనం టాలీవుడ్లో కొనసాగుతూనే ఉంది. టాలీవుడ్ లో నే కాకుండా సౌత్ మొత్తం అన్ని భాషలలో ఆయన సినిమాలు విడుదల చేస్తూ అక్కడ కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. అక్కడి ఫ్యాన్స్ ని ఖుషి చేయడం కోసం ఆయన డైరెక్ట్ గా సదరు భాషలలో సినిమాలు కూడా చేసి వారిని మేప్పించాడు. బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేసి అక్కడ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేయగా టాలీవుడ్ మీద ప్రేమతో ఇతర భాషలలోకి ఎక్కువగా వెళ్లలేదు.
అంతే కాదు ప్రపంచ వ్యాప్తంగా తన సత్తా చాటేందుకు చిరంజీవి ఓ హాలీవుడ్ చిత్రానికి కూడా పూనుకున్నారు. ది రిటర్న్ ఆఫ్ ద తీఫ్ ఆఫ్ బాగ్దాద్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసి సినిమాను రేపోమాపో మొదలు పెట్టి పూర్తి చేయాలని అనుకున్నారు. ఆ నేపథ్యంలోనే 1999లో ఈ సినిమాను మొదలు పెట్టి తెలుగులో అబు బాగ్దాద్ గజదొంగ అనే పేరు పెట్టారు. ఇంగ్లీష్ వెర్షన్ కి డోచేన్ గేర్సీ తెలుగు వర్షన్ కి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. మనీషా కోయిరాల హీరోయిన్ గా చేసింది. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ట్రైలర్ కూడా విడుదల అయింది. కానీ షూటింగ్ మాత్రం మధ్యలోనే ఆగిపోయింది. పలు అభ్యంతరకర సీన్లు ఉన్నాయని ఆందోళనలు రావడంతో ఈ సినిమా ఆగిపోయింది.