అల్లు శిరీష్ పై సానుభూతి !
సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ బాడీని మెయిన్ టైన్ చేయాలి అంటే చాల కఠోర దీక్ష అవసరం. మన టాప్ హీరోలు సిక్స్ ప్యాక్ బాడీని ఎక్స్ పోజ్ చేస్తూ ఒక్క రెండు నిముషాల సేపు స్క్రీన్ పై కనిపిస్తే అభిమానులు ఈలలు వేస్తారు. ఆ ఈలల కోసం ప్రేక్షకుల నుండి మెప్పు కోసం మన హీరోలు పడే కష్టం అంతా ఇంతా కాదు.
జిమ్ చేసి కండలు పెంచడం కోసం బైసెప్ ట్రై సెప్ చెస్ట్ షోల్డర్ యాబ్స్ అంటూ ఒకొక్క పార్ట్ కి ఒక్కో ప్రత్యేక శిక్షణ తీసుకుంటారు. నిపుణుడైన జిమ్ కోచ్ సమక్షంలో ట్రైనింగ్ తీసుకోవాలి. ఇలా జిమ్ చేస్తున్నప్పుడు చాల ఏకాగ్రతతో ఉండాలి. పర్ఫెక్షన్ సరిగ్గా లేకపోతే ఏదో ఒక కండరం చాల భయంకరంగా పట్టేస్తుంది. దానివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
ఇప్పుడు ఇలాంటి అనుభవమే అల్లు శిరీష్ కు ఎదురైంది. మెగా హీరోలు అంతా కండలు పెంచి తమ ఫిట్ నెస్ ను పెంచుకుంటూ ఉంటే అల్లు శిరీష్ కూడ అదే ప్రయోగం చేయాలని ప్రయత్నించి అనుకోకుండా సమస్యలలో పడ్డాడు. కండలు పెంచి యాబ్స్ కలిగిన షోల్డర్ కోసం కఠోరమైన శిక్షణ పొందుతున్నాడు. దీనికోసం నిపుణులైన కోచ్ ని కూడ పెట్టుకున్నాడు. కానీ ఏం తేడా జరిగిందో శిరీష్ మెడ పట్టేసింది. తనకు గాయం అయిందని అల్లు శిరిష్ ఇన్ స్టాలో తన అభిమానులకు తెలియచేస్తూ ఒక ఫోటోని షేర్ చేసాడు. ఈఫోటో మెగా అభిమానుల మధ్య క్షణాలలో వైరల్ గా మారింది.
చాలమంది శిరీష్ కు సానుభూతి తెలుపుతూ కామెంట్స్ పెడితే మరికొందరు లేటెస్ట్ గా శిరీష్ నటిస్తున్న మూవీ గురించి ఆలోచిస్తూ మెడ పట్టేసిందా అంటూ జోక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఐరన్ లెగ్ హీరోయిన్ గా పేరు గాంచిన అను ఇమ్మాన్యుయేల్ తో రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. లివిన్ రిలేషన్ షిప్ నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే..