రెడ్ హ్యాండెడ్గా దొరికిన స్టార్ హీరో.. బ్రేకప్ చెప్పేసిన హీరోయిన్...!
ఎప్పుడో 2008లో వీరి మధ్య స్నేహం కుదిరింది. లంచ్ నుంచి సాయంకాలం వరకు కాపీ మీట్లో మునిగి తేలారు. ఆ తర్వాత మాటలు కలిశాయి... చివరకు ఆ రోజు నైట్ సినిమా చూసే వరకు వెళ్లారు. ఆ మరుసటి రోజు నుంచే ఫ్రెండ్స్ అయిపోయారు. రణబీర్ కళ్లలో చూడగానే కనిపించే అమాయకత్వం ఎంతోమందిని ఆకట్టుకుంది. దానికే దీపిక పడిపోయింది. చివరకు దీపికను ఇంటి దగ్గర దిగబెట్టే వరకు గాడమైన స్నేహం ఏర్పడింది. వాళ్లిద్దరు కలిసి నటించిన తొలి సినిమా బచ్నా ఏ హసీనో. ఆ సినిమా సమయంలో వారిద్దరు ప్రేమికులు అయిపోయారు.
దీపిక మాత్రం రణబీర్తోనే జీవితం పంచుకోవాలని ఫిక్స్ అయిపోయింది. ఆమెకు నమ్మకాలు.. ఎమోషన్లు ఎక్కువ. అయితే బీ టౌన్ జనాలకు రణబీర్ గురించి బాగా తెలుసు. రణబీర్ ఆమెకు ఖచ్చితంగా హ్యాండ్ ఇస్తాడనే అనుకున్నారు. చివరకు అదే జరిగింది. దీపికతో ప్రేమలో అతడికి సీరియస్నెస్ లేదని చాలా మంది గ్రహించారు. ఎందుకంటే రణబీర్ అప్పటికే కత్రీనా వెంట పడుతున్నారు. చివరకు దీపికకు ఎవ్వరూ ఏమీ చెప్పినా నమ్మలేదు... ఓ రోజు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు... చివరకు ఆమె గుండె పగిలింది.. ఎంతో బాధతో ఆమె అతడికి బ్రేకప్ చెప్పక తప్పలేదు.