యూట్యూబర్ పై భారత్ నిషేధం.. ఎందుకో తెలుసా?
ఇటీవలి కాలంలో భారత్లో కి ఎంతో మంది దొంగ వీసాలపై ప్రవేశిస్తూ చివరికి ఇక్కడే సెటిల్ అవ్వాలని ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు ముఖ్యంగా ఎంతోమంది టూరిస్ట్ వీసా పై అటు భారత్ కి చేరుకొని ఇక్కడే తిష్ట వేసుకుని వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటున్న సంఘటనలు కూడా ఎన్నో తెర మీదకు వస్తున్నాయి. అయితే ఇలా అధికారికంగా కాకుండా టూరిస్టు వీసాలు పై భారత్ లోకి ప్రవేశిస్తున్న వారిపై పటిష్టమైన నిఘా పెట్టింది భారత ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఇటీవలే ఒక ఫేమస్ యూట్యూబర్ పై నిషేధం విధించినట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్కు చెందిన ప్రముఖ యూట్యూబర్ కార్ల్ ఎడ్వార్డ్ రైస్ ఫై .. భారత ప్రభుత్వం నిషేధం విధించింది.
దాదాపు ఏడాది పాటు భారత్ లోకి అడుగు పెట్టేందుకు వీలు లేదు అంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ యూట్యూబర్ టూరిస్ట్ వీసా పై భారత్ కి వచ్చాడు. ఇక ఎన్నో రోజుల పాటు ఇక్కడే ఉన్నాడు. ఆ తర్వాత ఇక్కడే వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. ఇక ఈ విషయాన్ని అధికారులు గుర్తించి కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే యూట్యూబ్ వ్యవహారం పై స్పందించిన కేంద్ర హోంశాఖ ఏకంగా ఏడాది పాటు నిషేధం విధిస్తున్నట్లు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే అతడి వీసా ను బ్లాక్ లిస్ట్ లో చేర్చింది కేంద్ర హోంశాఖ. ఏడాది పాటు భారత్ లోకి అడుగు పెట్టేందుకు వీలు లేదు అంటూ స్పష్టం చేస్తోంది.