పెట్రోల్ ధరల పెరుగుదలపై స్పందించిన నిఖిల్.. ఏమన్నాడంటే.
ఇలాంటి సమయంలో అటు పెట్రోల్ బాదుడు మాత్రం ఎక్కడ ఆగడం లేదు. పెట్రోల్ ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వమే కారణమని రాష్ట్ర ప్రభుత్వాలు.. లేదు లేదు రాష్ట్ర ప్రభుత్వాలే కారణం అంటూ కేంద్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు తప్ప పెట్రోల్ ధరలను తగ్గించేందుకు మాత్రం ప్రయత్నాలు చేయడంలేదు. దీంతో పెట్రోల్ ధరలు పెరుగుదల అందరినీ బెంబేలెత్తిస్తోంది. ఇలాంటి సమయంలో అత్యవసరం అయితే తప్ప వాహనాన్ని బయటకు తీయడం లేదు. ఇక ప్రస్తుతం దేశంలో పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టాయి అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రతిపక్ష పార్టీలు పెట్రోల్ ధరల పెరుగుదలపై నిరసనలు కూడా చేపడుతున్నాయి.
తాజాగా టాలీవుడ్ యువ హీరో పెట్రోల్ ధర పై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో యువ హీరోగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న నిఖిల్ పెట్రోల్ ధరల పెరుగుదల పై స్పందించాడు. ఇది దేశంలో అసలు ఎందుకు జరుగుతుంది? లీటర్ 35 రూపాయలు ఉండాల్సిన పెట్రోల్ డీజీల్ బంకుల్లో ఏకంగా వంద రూపాయలు దాటిపోయాయ్. ఈ ధరలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం భారీగా పెరిగిపోయిన ధరల వల్ల అందరూ ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు అంటూ ఇటీవల టాలీవుడ్ యువ హీరో నిఖిల్ చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయ్.