హీరో తనీష్ కి బంపర్ ఆఫర్ ?

VAMSI
ఒకప్పుడు టాలెంటెడ్ హీరోగా తెలుగు ప్రేక్షకుల మన్నలను పొందిన హీరో తనీష్ ఆ తర్వాత మెల్లగా కెరీర్ లో చతికిలపడ్డాడు. కొంతకాలం అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమయ్యడు. అయితే మళ్లీ ఇన్నాళ్లకు "మహా ప్రస్థానం" చిత్రంతో తిరిగి తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడానికి రెడీ అయిపోయాడు ఈ కుర్ర హీరో. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాకి మంచి హైప్ ని తీసుకురాగా ఈ సినిమా తనని తిరిగి ఇండస్ట్రీలో నిలబెడుతుందని భావిస్తున్నారట తనీష్. అయితే అనుకోకుండా ఈ సినిమా సెట్స్ పై ఉండగానే తనీష్ కి మరో సినిమా అవకాశం వచ్చిందని ఇప్పటికే అందుకు సంబంధించిన చర్చలు జరిగిపోయాయని తెలుస్తోంది. తనీష్ కి  హీరో గా లైఫ్ ఇచ్చిన నచ్చావులే దర్శకుడు రవిబాబు  ఇపుడు మరో ఆఫర్ ను ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో వైపు రవిబాబు కూడా ఈ మద్య కాస్త డీలా పడ్డాడు. అయితే ఇపుడు స్ట్రాంగ్ కంటెంట్ తో రాబోతున్నాడు అని హిట్ అందుకోవడం ఖాయమని అనుకుంటున్నారట.


కాగా ఇదో హారర్ అండ్ లవ్ ఎంటెర్టైనెర్ చిత్రమని సమాచారం. తెలుగులో హారర్ మూవీలను తెరకెక్కించడంలో రవి బాబు దిట్ట. అయితే ఇపుడు మరో సారి అదే కాన్సెప్ట్ తో కాస్త ఎంటర్ టైన్మెంట్ యాడ్ చేసి రాబోతున్నాడు అంటూ వార్తలు వినపడుతున్నాయి. ఈ సినిమాతో తనీష్ తనలోని మరో కోణాన్ని  స్క్రీన్ పై చూపించనున్నాడట. మరి ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన  తనీష్ దేవుళ్లు, మన్మధుడు వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. నచ్చావులే సినిమాతో హీరోగా తెరంగ్రేటం చేసి మొదటి చిత్రంతోనే సక్సెస్  అందుకున్నాడు. ఆ తర్వాత రైడ్, ఏం పిల్లో ఏం పిల్లడో, మేం వయసుకువచ్చాం వంటి చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆ తరువాత వరుస సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఇండస్ట్రీకి దూరమయ్యడు.


మళ్లీ చాలా కాలం తర్వాత బిగ్ బాస్ సీజన్ 3 లో కనిపించి ప్రేక్షకుల్ని అలరించాడు. ఆ తర్వాత హీరోగా వరుస ఆఫర్లు అందుకుంటారని అందరూ ఊహించినా అలా జరగలేదు. అయితే ఇటీవలే మహా ప్రస్థానం సినిమాతో మళ్లీ తన సినీ ప్రస్థానానికి రీ ఎంట్రీ ఇచ్చాడు. మరి ఈ సినిమా అయినా తన సినీ కెరీర్ ను మళ్లీ ఊపందుకునేలా చేస్తుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: