పాన్ ఇండియా మోజులో పెద్ద తప్పు చేస్తున్న హీరోలు..!?

N.ANJI
ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇతర భాషలోనూ తమ మార్కెట్ రేంజుని విస్తరించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు హీరోలు. ఇక ముఖ్యంగా తెలుగు హీరోలు ఇటీవల పాన్ ఇండియా కానెప్ట్ లను ఎంపిక చేసుకున్నారు. అయితే మాతృభాషలో తమ సినిమాలు కోట్లాది రూపాయలు వసూళ్లు తెస్తున్నప్పటికీ పర భాషల్లో అలాంటి ఫలితం నూటికి నూరు శాతం రావడం లేదు. తెలుగు హీరోలు చేస్తున్న పని మంచిదే అయినప్పటికీ తెలుగు పరిశ్రమకు ఇది అంత మంచిది కాదేమో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే ఇలా చేయడం వలన పరభాషా హీరోలకి తెలుగు చిత్ర పరిశ్రమలో గ్రాండ్ గా వెల్కమ్ డోర్లు ఓపెన్ చేసినట్లే ఉంటుంది. ఇక తెలుగు హీరోలు పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టడంతో కోలీవుడ్ హీరోలు తెలుగు మార్కెట్ పై దండెత్తే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇటీవల శాండల్వుడ్ నుంచి పలువురు హీరోలు టాలీవుడ్ మార్కెట్ పై సీరియస్ గా కన్నేశారు. కాగా.. మాలీవుడ్ నుంచి పలువురు స్టార్లు ఇక్కడా తమ పరపతి పెంచుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఒక రకంగా ఇది ఇబ్బందికర సన్నివేశమేనని ఒక సెక్షన్ విశ్లేషిస్తోంది.

ఇక తమిళ స్టార్ హీరోలు విజయ్- ధనుష్- సూర్య- కార్తీ- శివ కార్తికేయన్ లాంటి హీరోలు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేయడానికి సిద్ధం  అవుతుండడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే వీళ్లంతా పాన్ ఇండియా పేరుతో నేరుగా టాలీవుడ్ ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. అంతేకాక టాలీవుడ్ నిర్మాతలు కోలీవుడ్ హీరోలతో సినిమాలు నిర్మించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ లో ఒక తెలుగు స్టార్ ఒక తమిళస్టార్ హీరోని కలుపుకుని బహుభాషా చిత్రాలు చేసే ప్రయత్నం పెద్దగానే వర్కవుటయ్యేందుకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తుంది. ఆ తరుణంలో ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చి విజయాన్ని అందుకున్నాయి. తెలుగులో అగ్ర హీరో .. తమిళ అగ్ర హీరో కలిసి పెద్ద రేంజులో ప్రయత్నాలు చేయలేదు. అయితే ఒకవేళ అలాంటి ప్రయత్నం చేస్తే ఇరువైపులా వర్కవుటయ్యేందుకు ఆస్కారం ఉంటుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: