పుష్ప షూటింగ్‌లో బీజీగా ఉన్న బన్నీ మరో చిత్రం తీయడానికి బోయపాటితో ప్లాన్ చేస్తున్నాడని సిని వర్గాల్లో టాక్ నడుస్తోంది. అల వైకుంఠపురములో మూవీతో బిగ్ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌డమ్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కేరళలో తన మార్క్‌ను చాటుకున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న 'పుష్ప' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ఐదు ప్రధాన భాషల్లో విడుదల చేయనున్నారు.
ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుందని తెలుస్తోంది. భవిష్యత్ లో బన్ని వీలయినన్ని పాన్ ఇండియా సినిమాలే తీయాలనుకుంటున్నారు. దాని కోసం ఏఆర్ మురగదాస్ - బోయపాటి శ్రీను - కొరటాల శివ - ప్రశాంత్ నీల్ వంటి అగ్ర దర్శకులతో టచ్‌లో ఉంటున్నారు. ఇటీవలనే బన్నీ మిత్రుడుతుడు బన్నీ వాస్ ఈ లైనప్ గురించి వివరించారు. ఇప్పటికే 'పుష్ప 1' చిత్రానికి సంబంధించిన మెజారిటీ భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. మైత్రీ మూవీ మేకింగ్ చేస్తన్న ఈ మూవీ ఈ సంవత్సరం చివరన లేదా వచ్చే ఏడాది మొదట్లో రిలీజ్ కానుంది.
'పుష్ప` తర్వాత వెంటనే 'పుష్ప 2' చేయకుండా.. ఇతర సినిమాలు చేయాలని బన్ని నిర్ణయించుకున్నట్టు సమాచారం.దాని కోసమే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'ఐకాన్' అనే సినిమాని ముందు పూర్తి చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఐకాన్‌ను నిర్మించనున్నారు. ఈ కథను పాన్ ఇండియా స్క్రిప్ట్ మార్చే పనిలో సినిమా టీమ్ ఉందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.
ఐకాన్ తరువాత పుష్ప2 పనులు మొదలు కానున్నాయి. దాని తరువాత స్టైలిష్ స్టార్ బన్నీ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో సినిమా చేసే అవకాశం ఉందని సిని వర్గాల్లో వినిపిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సరైనోడు చిత్రం మంచి హిట్ కొట్టింది. అంతే కాకుండా బన్నీలోని మిగతా షేడ్స్ ఈ సినిమా ద్వారా తెలిసింది. అందు వలనే బన్నీ- బోయపాటి కాంబినేషన్ కోసం వారి ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. వీరి సినిమా అల్రెడీ ఫిక్స్ అయిందని, పుష్ప2 తరువాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని టాక్ వినిపిస్తోంది. ఈ విషయం త్వరలోనే ప్రకటన వస్తుందని అనుకుంటున్నారు. వీరిరువురి కాంబినేషన్‌లో మరో సినిమా వస్తే బాక్స్ ఆఫీస్ కు కాసుల వర్షం కురుస్తుందని సినిమా క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు.