ఆ బాలీవుడ్ హీరోని తెగ వాడేస్తున్న మంచు బ్రదర్స్..!!

Anilkumar
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పాపులర్ ఫ్యామిలీస్ లో మంచు వారి ఫ్యామిలీ కూడా ఒకటి.కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నట వారసులుగా వెండితెరపై హీరోలుగా తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మంచు విష్ణు, మంచు మనోజ్.ఇక వీరిద్దరూ కాకుండా అటు మోహన్ బాబు గారాల కూతురు మంచు లక్ష్మి సైతం నటిగా కొన్ని సినిమాల్లో నటించి.. మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే మంచు ఫ్యామిలీ వారి సినిమాల్లో ఎవరైనా నటిస్తే..ఆ నటీ నటులను మళ్ళీ మళ్ళీ వరుస సినిమాల్లో అవకాశాలు ఇస్తుంటారు.గతంలో చాలామంది నటీ నటుల విషయంలో ఇదే జరిగింది.ఇప్పుడు కూడా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి విషయంలోనూ అదే జరుగుతోంది.

మంచు మనోజ్ చాలా గ్యాప్ తర్వాత 'అహం బ్రహ్మాస్మి' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.చాలా రోజుల క్రితమే ప్రారంభమైన ఈ సినిమా కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది.అయితే తాజాగా కరోనా ప్రభావం తగ్గి.. మళ్ళీ షూటింగ్స్ మొదలవ్వడంతో ఈ సినిమా షూటింగ్ ని కూడా ప్రారంభించనున్నారట మేకర్స్. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ని ఎంపిక చేసిందట చిత్ర బృందం.ఈ సినిమాలో సునీల్ శెట్టి పాత్ర క్లైమాక్స్ లో ఎంటర్ అవుతుందట.అయితే సినిమాలో ఆయన పాత్ర నిడివి చాలా తక్కువే అయినా..అదే సినిమాకు కీలకంగా మారనుందని అంటున్నారు. 

అందుకే సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యత ఉండడంతో సునీల్ శెట్టి కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇక తమ సొంత నిర్మాణ సంస్థ 'ఎమ్ ఎమ్ ఆర్ట్స్'బ్యానర్ పై మంచు మనోజ్ తో పాటు అతని కుటుంబం కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.శ్రీకాంత్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇటీవలే మంచు విష్ణు, కాజల్ నటించిన 'మోసగాళ్ళు' అనే సినిమాలో కూడా సునీల్ శెట్టి ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.అలా మొత్తానికి మన బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టిని ముందు అన్న విష్ణు వాడుకుంటే.. ఇప్పుడు తమ్ముడు మనోజ్ తన సినిమాకు వాడుకుంటున్నాడు.మరి ఈ సినిమాతో అయినా మంచు వారబ్బాయి కం బ్యాక్ ఇస్తాడేమో చూడాలి...!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: