రవితేజా నిర్ణయంతో షాక్ లో నందమూరి ఫ్యామిలీ !
‘రామారావు’ అనే పదం వింటే నందమూరి అభిమానులలో ఒక కలకలం క్రియేట్ అవుతుంది. అందువల్లనే నందమూరి తారకరామారావు అనే పేరును నందమూరి ఫ్యామిలీ ట్రేడ్ మార్క్ గా నందమూరి అభిమానులు భావిస్తూ ఉంటారు. దీనికి తగ్గట్టుగానే నందమూరి హీరోలు కూడ తారక రామారావు ప్రస్తావన తాము నటించే పాత్రల డైలాగులలో తరుచు తీసుకు వస్తూ ఉంటారు.
అయితే ఇప్పుడు ఈ బ్రాండ్ పై మాస్ మహారాజా రవితేజా కన్ను పడటం షాకింగ్ న్యూస్ గా మారింది. ‘క్రాక్’ విజయం తరువాత రవితేజ తన సినిమాల విషయంలో వేగం పెంచడమే కాకుండా డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ టాప్ హీరోలకు షాక్ ఇస్తున్నాడు. ఈ నేపధ్యంలో మాస్ మహారాజ రవితేజా తన లేటెస్ట్ మూవీ టైటిల్ విషయంలో ఎవరు ఊహించని నిర్ణయం తీసుకుని నందమూరి అభిమానులకు షాక్ ఇచ్చాడు.
యంగ్ డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వంలో రవితేజా నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైటిల్ ను ‘రామారావు’ అని ఫిక్స్ చేసారు. చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో మైనింగ్ మాఫియా చుట్టూ తిరిగే కథ ఇది అని తెలుస్తోంది. ‘మేక వన్నె పులి’ అన్న ట్యాగ్ ఈ మూవీ పోష్టర్ లో కనిపిస్తూ ఉండటంతో రవితేజా ఈ మూవీలో అండర్ కవర్ ఆపరేషన్స్ చేసే ఒక ఫారెస్ట్ అధికారిగా ఈ మూవీలో నటిస్తాడని అర్థం అవుతోంది.
ఒకవైపు సినిమాలలో నటిస్తూనే రవితేజా సినిమా నిర్మాణంలో భాగస్వామిగా కొనసాగుతూ ప్రస్తుతం టాప్ యంగ్ హీరోలు అనుసరిస్తున్న ట్రెండ్ ను కొనసాగిస్తున్నాడు. ‘క్రాక్’ సక్సస్ తరువాత మాస్ మహారాజా తన పారితోషికాన్ని 15 కోట్ల స్థాయికి తీసుకు వెళ్ళిపోయాడు అని వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు కమర్షియల్ హీరోలలో మినుమం గ్యారెంటీ హీరోగా రావితేజా కు మంచి క్రేజ్ ఉండేది. అయితే ఆమధ్య వచ్చిన వరస పరాజయాలతో ఇతడి స్పీడ్ తగ్గినా మళ్ళీ ‘క్రాక్’ తో ట్రాక్ లోకి వచ్చి తన రేంజ్ ఏమిటో నిరూపించుకుంటున్నాడు..