ఆవిడ కారణంగానే రాజశేఖర్, శ్రీదేవి ల పెళ్లి ఆగిపోయింది..

Divya
హీరో రాజశేఖర్ ఫ్యామిలీ సినిమాలలో నటించి అందరి ఆదరణ పొందిన హీరోగా గుర్తింపు పొందాడు. ఈయన తమిళ రాష్ట్రానికి చెందిన వారు అయినప్పటికీ తెలుగు సినీ ఇండస్ట్రీ లోనే స్టార్ హీరోగా ఎదిగారు. అయితే రాజశేఖర్, శ్రీదేవి పెళ్లి జరగకపోవడానికి ఒక కారణం ఉందట. ఆ కారణం ఏదో తెలుసుకుందాం.


హీరో రాజశేఖర్ ఒక పక్క హీరోగా నటిస్తూ, ఒకపక్క ఫ్యామిలీ సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. ఇక రాజశేఖర్ తండ్రి, అలనాటి నటి శ్రీదేవి వాళ్ల నాన్న వీరిరువురు మంచి స్నేహితులు. ఒకానొక సమయంలో శ్రీదేవి కి , రాజశేఖర్ కి పెళ్లి చేయాలని నిశ్చయించారు. కానీ అప్పటికి ఇంకా రాజశేఖర్ సినీ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టలేదు. కానీ శ్రీదేవి మాత్రం అప్పట్లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోతుంది.

కానీ వీరి వివాహానికి రాజశేఖర్ వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదట."అంతే కాకుండా సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయిలను మాత్రం వివాహం ఆడవద్దని రాజశేఖర్ తో ఒట్టు వేయించుకున్నదట." కాని రాజశేఖర్ మాత్రం అనుకోకుండా సినిమాలలోకి వచ్చారు. ఇక ఈయన  కూడా స్టార్ హీరో గా ఎదిగారు. కాని చివరికి మాత్రం ఈయన సినీ పరిశ్రమకు చెందిన ఆమెనే (జీవిత)  వివాహం చేసుకున్నారు.

1991 లో  రాజశేఖర్ నటిస్తున్న "మగాడు" అనే సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో.. రాజశేఖర్ కు తీవ్ర గాయాలయ్యాయి, అదే సమయంలో జీవిత దగ్గరుండి చూసుకోవడం వల్ల, ఆమె రాజశేఖర్ వాళ్ల తల్లిదండ్రులకు నచ్చడంతో వీరిరువురికీ వివాహం చేశారని, వీరిద్దరూ ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ద్వారా తెలిపారు. ప్రస్తుతం రాజశేఖర్ కి ఇద్దరు కూతుర్లు ఉన్న విషయం తెలిసిందే. అందులో ఒకరు హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమె ఎవరో కాదు శివాని రాజశేఖర్. శివాని రాజశేఖర్ ప్రస్తుతం తేజ సజ్జ సరసన ఒక సినిమాలో నటిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: