దుల్కర్ సల్మాన్ సినిమాలో సుమంత్.. అయ్యో పాపం అంటున్న ఫ్యాన్స్..?
అయితే తాను ఎలాగూ హీరోగా రాణించలేకపోతున్నానని డిసైడ్ అయిపోయిన సుమంత్ మంచి ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్లు చేయడానికి మాత్రం సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెరమీదికి వచ్చింది. అదేంటంటే, అమ్మాయిల రాకుమారుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో ఒక కీలకమైన పాత్ర పోషించడానికి సుమంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక పిరియాడిక్ లవ్ స్టోరీ తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో సుమంత్.. హీరో స్నేహితుడిగా, ఒక సైనికుడిగా నటించనున్నారట. దుల్కర్ సల్మాన్ ప్రేమను గెలిపించేందుకు సుమన్ తన ప్రాణాలను సైతం త్యాగం చేస్తారట. సెకండాఫ్ లో సుమంత్ సన్నివేశాలు ఆద్యంతం భావోద్వేగంగా ఉంటాయని తెలుస్తోంది.
హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో దుల్కర్ సల్మాన్ సినిమాకి సంబంధించి భారీ సెట్ నిర్మించాలని సమాచారం. 1964 బ్యాక్డ్రాప్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ ఎంటర్టైనర్ ని వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్ నిర్మిస్తోంది.