RAPO19 టీంకి సడన్ సర్ప్రైజ్ ఇచ్చిన శంకర్....

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ ప్రస్తుతం కోలీవుడ్ మాస్ డైరెక్టర్ లింగస్వామితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని తెలుగు తమిళంలో ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కి సిద్ధమవుతోంది.ఇక మూవీ టీమ్‌ను ప్రముఖ స్టార్ డైరెక్టర్ ఇండియన్ జేమ్స్ కామెరూన్ గా పిలవబడే శంకర్ కలిసి వారిని సర్‌ప్రైజ్ చేశారు. ఇక ప్రస్తుత బిజీ షెడ్యూల్‌లో రామ్ సినిమా షూటింగ్ చూడడానికి శంకర్ వచ్చాడు. శంకర్ రాకతో  సర్ ప్రైజ్ కి లోనైన చిత్రబృందం, ఆయనకు ఘన స్వాగతం పలికింది.లింగు స్వామి శంకర్ కి మంచి సన్నిహితుడు కావడంతో శంకర్ చిత్ర బృందాన్ని దర్శించాడట.ఉస్తాద్ రామ్ హీరోగా మాస్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో తెరాకెక్కుతున్న ఈ ఊర మాస్ సినిమా  తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.


 


ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. స్టార్ డైరెక్టర్ శంకర్ బుధవారం సెట్స్ కి రావడంతో ఆయనతో సినిమా యూనిట్ క్వాలిటీ టీం టైం స్పెండ్ చేశారు. ఇక ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ "సోమవారం సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాం. హీరో రామ్, హీరోయిన్ కృతీ శెట్టి, నదియా తదితరులపై లింగుసామి సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.ఇక సడన్‌గా సెట్స్‌కు వచ్చిన శంకర్‌ గారిని చూసి టీమ్ అందరూ బాగా సర్‌ప్రైజ్ అయ్యారు. ఆయనకు హీరో రామ్, హీరోయిన్ కృతి, నదియా, లింగుసామి ఘన స్వాగతం పలికారు. ఇటీవల రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన లవ్ సాంగ్ ట్యూన్ వినిపించారు. మెలోడీయస్ గా ఆకట్టుకుంటూ చాలా బావుందని ఆయన ప్రశంసించడం మాకెంతో సంతోషాన్నిచ్చింది" అని నిర్మాత అన్నారు. ఇక రామ్ హీరోగా నటిస్తున్న 19వ చిత్రం కావడంతో ఈ సినిమాని RAPO19 గా వ్యవహరిస్తున్నారు.కరోనా నిబంధనలు పాటిస్తూ చిత్రీకరణ చేస్తున్నారు. ఇక ఈ సినిమా భారీ బ‌డ్జెట్‌తో, హై టెక్నిక‌ల్ వ్యాల్యూస్‌తో తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతుంది. ఇక చూడాలి లింగస్వామి ఈ చిత్రాన్ని ఎలా తెరాకెక్కిస్తాడో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: