నిర్మాణం వైపు మొగ్గు చూపుతున్న యువ హీరో... ?

VAMSI
తెలుగు సినిమా పరిశ్రమలో ఒక సహా నటుడి స్థాయి నుండి హీరోగా ఎదిగి ఫుల్ జోష్ లో ఉన్న హీరో నిఖిల్ ప్రొడక్షన్ రంగం వైపు అడుగులు వేయడానికి మంతనాలు జరుగుతున్నాయంటూ టాలీవుడ్ లో వినికిడి . ఈ మధ్య కాలంలో చాలా మంది స్టార్ హీరోలు నిర్మాణం వైపు మొగ్గు చూపగా, ఇప్పుడు ఈ యంగ్ హీరో సైతం ఆ దిశగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సొంత నిర్మాణం కాదని తన సినీ సన్నిహితులైన ఓ ప్రముఖునితో కలసి సంయుక్తంగా ఇకపై సినిమాలు నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ ను ఫినిష్ చేశారని త్వరలోనే ఈ విషయాన్ని వారి నూతన బ్యానర్ ని అధికారికంగా ప్రకటించనున్నట్లు ప్రచారం సాగుతోంది.

అయితే ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.  కాగా అనతి కాలంలోనే గొప్ప గుర్తింపును దక్కించుకున్న   హీరో నిఖిల్ కి చాలామంది డైరెక్టర్స్ తో పరిచయం ఉన్న విషయం తెలిసిందే. హ్యాపీడేస్ చిత్రంతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో నిఖిల్ తన టాలెంట్ తో హ్యాపీగా సినీ ఇండస్ట్రీలో సెటిలైపోయాడు. ఎప్పటికప్పుడు వైవిద్యభరితమైన కథలను ఎంచుకుంటూ ఒక ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నాడు ఈ కార్తికేయ.  అర్జున్ సురవరం అందించిన సక్సెస్ తో మంచి స్పీడ్ మీద ఉన్న ఈ హీరో వరుస చిత్రాలతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథను అందించగా, పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో "18 పేజెస్" చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చేస్తోంది. కార్తికేయ సీక్వెల్ కూడా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. మరి నిఖిల్ నిర్మాతగా ఎంత మేరకు రాణిస్తాడో చూడాలి. హీరో గా సెటిల్ అయినంత ఈజీ కాదు, నిర్మాతగా నిలదొక్కుకోవడం. అయితే అటు హీరోగా ఇటు నిర్మాతగా ఏ విధంగా బాలన్స్ చేసుకుంటాడో పోను పోను తెలియనుంది. ప్రస్తుతానికి ఇది ఒక గాసిప్ లాగే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: