వివాదంలో బాలీవూడ్ స్టార్ హీరోయిన్..!

N.ANJI
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఇటీవల ఆమె తన ప్రగ్నెన్సీ అనుభవాన్ని పుస్తకం రూపంలో విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిన విదితమే. ఈ పుస్తకంలో ఆమె ‘కరీనా కపూర్‌ ఖాన్స్‌ ప్రగ్నెన్సీ బైబిల్‌’ అనే టైటిల్‌తో విడుదల చేశారు. దాంతో మహారాష్ట్రకు చెందిన పలు క్రిస్టియన్‌ సంఘాలు కరీనా బుక్‌ టైటిల్‌ను వ్యతిరేకిస్తూ శివాజీ నగర్‌ పోలీస్ స్టేషన్ లో కరీనాతో పాటు మరో ఇద్దరిపై కరీనాతో పాటు మరో ఇద్దరిపై ఫిర్యాదు చేశారు.
అయితే అల్ఫా, ఒమెగా క్రిస్టియన్‌ మహాసంగ్‌ అధ్యక్షుడు ఆశిష్‌ షిండే కరీనాపై ఫిర్యాదు చేసినట్లు బీడ్‌లోని శివాజీ నగర్‌ పోలీసు స్టేషన్‌ ఇంచార్జ్‌ శ్రీనాథ్‌ తంభోర్‌ మీడియాకు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కరీనాతో పాటు ఈ బుక్‌ రాసిన మరో రచయిత అదితి షా భీమ్జని, బుక్‌ పబ్లిషర్‌ సంస్థ జాగ్గర్‌ నట్‌ బుక్‌పై కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇక ఆశిష్‌ షిండే తన ఫిర్యాదులో కరీనా కపూర్‌ బుక్‌ టైటిల్‌ క్రిస్టియన్‌ల పవిత్ర గ్రంథమైన బైబిల్‌ను అవమానించేలా ఉందని అన్నారు. అంతేకాక  ఇది క్రిస్టియన్‌ మనోభవాలను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.
అంతేకాదు.. కరీనాతో పాటు మరో ఇద్దరిపై ఐపీసీ సెక్షన్‌ 295-ఏ కింద కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేసినట్లు తెలిపారు. ఇక దీనిపై కంప్లైట్‌ తీసుకున్నాము కానీ, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని ఆయన తెలిపారు. కాగా.. ముంబై పరిధిలోకి వస్తుందని, తమ స్టేషన్‌ పరిధిలోకి రాదని ఆయనకు స్పష్టం చేసినట్లు సదరు అధికారి తెలిపారు. దాంతో షిండే ముంబైలో కేసు నమోదు చేయాల్సిందిగా ఆయనకు సలహా ఇచ్చినట్లు తెలిపారు.
ఇక కరీనా తను రాసిన బుక్‌ను జులై 9న విడుదల చేసిన సంగతి తెలిసిన విదితమే. ఈ పుస్తకం విడుదల సందర్భంగా కరీనా మాట్లాడుతూ.. ఈ బుక్‌ తనకు బిడ్డతో సమానం అని, ఇది తన మూడవ బిడ్డ అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక.. ఈ బుక్‌ను సోషల్‌ మీడియా ప్రమోట్‌ చేస్తూ ఇందులో తను గర్భవతిగా ఉన్నప్పుడు భౌతికంగా, మానసికంగా ఎలాంటి అనుభవాన్ని ఎదుర్కొందో వివరిస్తూ భావోద్వేగానికి లోనైనట్లు తెలిపారు. ఇక ఇటీవల కరీనా రెండవ బిడ్డకు జన్మనిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: