తన సినిమాకి తానే గెస్ట్ గా రాజమౌళి?
అప్పట్లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చత్రపతి సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. అయితే సాధారణంగా రాజమౌళి తెరకెక్కించిన సినిమాలను ఏ దర్శకుడు కూడా రీమేక్ చేయడానికి సాహసం చేయరు. కానీ అప్పట్లో రాజమౌళి తెరకెక్కించిన చత్రపతి సినిమా ను హిందీలో రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో చత్రపతి హిందీ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పాత్రలో టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.
అయితే చత్రపతి సినిమాను తెరకెక్కించి అద్భుతమైన విజయాన్ని సాధించిన దర్శక ధీరుడు రాజమౌళి మరి కొన్ని రోజుల్లో తన సినిమాకి గెస్ట్ గా వెళ్ల పోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న చత్రపతి హిందీ రీమేక్ సినిమా షూటింగ్ జూన్ 16వ తేదీన ఘనంగా ప్రారంభించబోతున్నారట. ఇక ఈ సినిమాకు రాజమౌళి రావాలి అంటూ ఈ పిలుపు అందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇక తన సినిమా హిందీ రీమేక్ కోసం ఇక ముఖ్యఅతిథిగా రాజమౌళి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా తన సినిమాకు తానే గెస్ట్ గా వెళ్లడం అంటే అది గొప్ప విషయమే కదా అని అంటున్నారు అభిమానులు.