బాలీవుడ్ సూపర్ స్టార్ లు ఒకే సినిమాలో కలిస్తే ?

VAMSI
సాధారణంగా ఒక సూపర్ స్టార్ సినిమా వస్తుంది అంటే.. ఆ సినిమాకి వచ్చే క్రేజ్ ఓ రేంజ్ లో ఉంటుంది. అభిమాన సంఘాలు తమ అగ్రతార సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. స్టార్ హీరో సినిమా అని ప్రకటించడం మొదలు ఇక అప్పటి నుండి విడుదల అయ్యే అంతవరకు సోషల్ మీడియాలో అంతా సందడే సందడి. ఇక ఒకే స్క్రీన్ పై ఇద్దరు స్టార్ హీరోలు కలసి తమ హీరోయిజం చూపించబోతున్నారు అంటే ఇక ఫ్యాన్స్ కి పండగే పండగ. ఇప్పుడు అలాంటి స్టార్ కాంబినేషన్ ను వెండి తెరపై ప్రెజెంట్ చేయబోతోందట బాలీవుడ్ ఇండస్ట్రీ. బాలీవుడ్ టాలెంటెడ్ హీరో షారుఖ్ ఖాన్, సూపర్ స్టార్ సంజయ్‌దత్‌ కలిసి ఓకే సినిమాలో నటించబోతున్నట్టు సమాచారం.

బాక్సాఫీస్ వద్ద తమ స్టార్ డం ప్రభావాన్ని చూపే ఈ ఇద్దరు కథానాయకులు చేయబోతున్నారు అంటే ఆ లెక్కే వేరు. ఈ క్రేజీ కాంబో చిత్రానికి రాఖీ అనే టైటిల్ ను ఫైనల్ చేసినట్లు  తెలుస్తోంది. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి దర్శకుడు నిర్మాత ఎవరు అనే విషయాలు త్వరలో తెలియనున్నాయి. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే పేరు వినిపిస్తోంది. మరి రెండవ హీరోయిన్ గురించి ఇంకా వేటలోనే ఉన్నారని సమాచారం. షారుఖ్ మరియు సంజయ్ దత్ కు మధ్యన సత్సబంధాలు ఉన్నాయని , వీరిద్దరూ మంచి స్నేహితులని చాలా సార్లు విన్నాం. అయితే ఇప్పుడు ఈ మూవీతో వెండితెరపై ఈ ఇద్దరిని కలిసి చూసే అవకాశం లభించబోతుండడం విశేషం.

గతంలో కూడా  బ్లాక్ బాస్టర్ మూవీ "ఓం శాంతి ఓం" లో  ఓ పాటలో షారుఖ్ ఖాన్ తో సంజయ్ దత్ కలసి కాలు కదిపి ప్రేక్షకులను అలరించగా, ఇప్పుడు ఈ సినిమాలో పూర్తి స్థాయిలో ఎక్కువ నిడివితో సంజయ్ నటించబోతున్నారని సమాచారం. మరి ఈ సినిమా షూటింగ్ మరియు ఇతర అప్ డేట్స్ త్వరలోనే తెలియనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: