కొంపమునిగింది.. అయ్యో..!

NAGARJUNA NAKKA
షారుఖ్ ఖాన్‌ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన బాలీవుడ్‌ బాద్‌షా. రొమాంటిక్ చిత్రాలతో యూత్ ఐకాన్ గా మారిపోయాడు ఈ హీరో. తన సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాలీవుడ్ జనాల్లో అలా ఉండిపోయాడు.   అంతటి పాపులారిటీ సాధించిన హీరోను ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు దర్శక, నిర్మాతలు. ఇతని కంటే బెటర్ ఎవరుంటారు అని వెతుకులాటలో పడ్డారు.  

'చెన్నై ఎక్స్‌ప్రెస్' వరకు షారుఖ్‌ ఖాన్‌ సినీ లైఫ్ బాగానే జరిగింది. అయితే ఈ సినిమా తర్వాత షారుఖ్‌ ఖాన్ వరుసగా ఫ్లాప్ లు చవిచూడాల్సి వచ్చింది. 'దిల్‌ వాలే, జబ్‌ హ్యారీ మెట్ సెజల్, జీరో' ఫ్లాపులతో షారుఖ్‌ మార్కెట్‌ కూడా పడిపోయింది. ఇక సొంత బ్యానర్‌లో చేసిన 'జీరో' డిజాస్టర్‌తో షారుఖ్‌ మూడేళ్లపాటు సినిమాలకి దూరమయ్యాడు.

షారుఖ్ ఖాన్ 'పఠాన్' అనే సినిమాతో మళ్లీ జనాలముందుకొస్తున్నాడు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాపై బాద్‌షా చాలా హోప్స్ పెట్టుకున్నాడు. అలాగే సంజయ్‌ లీలా భన్సాలి దర్శకత్వంలో 'ఇన్షాఅల్లా' అనే సినిమా కూడా చెయ్యాలనుకున్నాడు. ఆలియా భట్, షారుఖ్ లీడ్‌ రోల్స్‌ ప్లే చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు భన్సాలి, షారుఖ్‌ ప్లేస్‌లో హృతిక్‌ని తీసుకుంటున్నాడట.


ట్వంటీ ప్లస్‌లో ఉన్న అమ్మాయి ఫార్టీ ప్లస్‌లో ఉన్న మిడిల్‌ ఏజ్డ్ పర్సన్‌తో ప్రేమలో పడితే, సొసైటీ ఎలా రియాక్ట్ అవుతుందనే కాన్సెప్ట్‌తో 'ఇన్షాఅల్లా' సినిమాని డిజైన్ చేశాడు భన్సాలి. అందుకే మిడిల్‌ఏజ్డ్ పర్సన్‌ రోల్ కోసం 55 ఏళ్ల షారుఖ్‌ని కాంటాక్ట్ చేశాడు. 'గంగూభాయ్' తర్వాత ప్రాజెక్ట్ మొదలుపెట్టాలని ఫిక్స్ అయ్యాడు. కానీ ఇప్పుడు షారుఖ్‌ని కాదని హృతిక్‌ని సంప్రదించాడట భన్సాలి.

షారుఖ్‌ ఖాన్‌కి పెద్దగా మార్కెట్‌ లేదు.. వరుసఫ్లాపులతో గ్రాఫ్ పడిపోయింది. అందుకే షారుఖ్‌ని పక్కనపెట్టి, హృతిక్‌ రోషన్‌ని తీసుకుంటున్నారని కామెంట్‌ చేస్తున్నారు బాలీవుడ్ జనాలు. అంతేకాదు, ఇక షారుఖ్ పనైపోయిందని, అర్జంట్‌గా హిట్‌ కొట్టకపోతే అంతే సంగతులని కామెంట్‌ చేస్తున్నారు. మరి ఈ కష్టకాలం నుంచి షారుఖ్ ఎలా బయటపడతాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: