నాగార్జున కెరీర్లో ఆ ఒక్క హీరోయిన్ కే భయపడ్డాడా..?
నాగార్జున సినిమా వస్తుందంటే , 1989 దశకాల్లో కాలేజ్ అమ్మాయిలంతా ఆ సినిమా రిలీజ్ రోజు కాలేజీ ఎగ్గొట్టి మరీ , సినిమా చూసేవారు. అలాంటి నాగార్జున సొంతం, ప్రేమకథ సినిమాలతో అమ్మాయిల మనసు దోచుకోవడం తోపాటు, తన తండ్రి లాగే మజ్ను లాంటి విషాదాంత సినిమాలు కూడా చేయటం నాగార్జునకే సాధ్యమైంది. అన్నమయ్య రామదాసు లో భక్తుడిగా నా శివ సినిమా కాలేజ్ కుర్రాళ్ళ రియల్ హీరో గాను మారిపోయాడు. తన సినీ జీవితంలో ఎంతో మంది హీరోయిన్ లతో రొమాన్స్ చేసిన నాగార్జున, ఏ హీరోయిన్ ను కూడా చూసి భయపడ్డలేదట. అలాంటి నాగార్జునను ఒకే ఒక హీరోయిన్ భయపెట్టేసిందట.
ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు అతిలోక సుందరి శ్రీదేవి.. నాగార్జున పక్కన ఆఖరి పోరాటం సినిమా లో శ్రీదేవి నటించింది. అయితే ఆమె అప్పటికే ఏఎన్నార్ తో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేయడంతోపాటు, ఆల్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఉన్నారు. అలాంటి హీరోయిన్ తో తాను నటిస్తున్నాను అని తెలియగానే, నాగార్జున లోపల కాస్త భయంగా ఫీల్ అయ్యారట. అయితే అదే శ్రీదేవితో గోవింద గోవింద సినిమా చేసినప్పుడు, తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. అలాగే తన భార్య అమలతో సినిమాలు చేస్తున్న క్రమంలో, ఆమెతో ప్రేమాయణం కొనసాగిస్తున్నప్పుడు మాత్రం లోలోన ఎక్కడో చిన్న భయం ఉండేది.. అని నాగార్జున ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.