వనిత విజయకుమార్ గత ఏడాది కాలం నుంచి ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. కొన్ని రోజుల క్రితం వనిత హీరోయిన్ రమ్యకృష్ణ పై కూడా సంచలన ఆరోపణలు చేయడం వల్ల కూడా వార్తల్లో నిలిచింది. వనిత మూడో పెళ్లి ద్వారా ఎక్కువగా ఫోకస్ అయింది. మూడో వివాహం చేసుకున్న భర్త తో కూడా విడిపోవడం గమనార్హం. ఈ హీరోయిన్ తన ఫీలింగ్స్ ని సోషల్ మీడియా ద్వారా కూడా పంచుకుంటూ ఉంటుంది. అందులో భాగంగా మూడో భర్తతో విడిపోయి నా సమయంలో నేను సింగిల్ అంటూ ఒక పోస్ట్ కూడా చేసింది .
ఈ పోస్టు కొంతమంది నెటిజన్లు నెగిటివ్ కామెంట్లు కూడా చేశారు. మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భర్తలతో విడిపోవడం కూడా అప్పట్లో ఒక చర్చనీయాంశంగా మారింది. కొన్ని రోజుల క్రితం వరకు ఈ నటి నాలుగో పెళ్లి చేసుకుంటుంది అని కొన్ని వార్తలు వచ్చాయి. దానిపై స్పందించి వనిత అలాంటిదేమీ లేదు. అని నేను నా పిల్లలతో కలిసి సంతోషంగా ఉంటున్నానని ఇప్పుడు అలాంటి ఆలోచనలు ఏమి లేవని ప్రకటించింది .కొంతమంది చాలా అసభ్యకరంగా మీ భర్త ఎవరు అంటూ అడుగుతున్నారని అలాంటి మాటలు విన్నప్పుడు చాలా బాధగా ఉంటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయాలను ఈ నటి తన ఇంట్లో జరిగిన కుబేర స్వామి పూజ సందర్భంగా తెలియజేసింది.
ఈ పూజకు సంబంధించిన ఫోటోలను వనిత తన ఇంస్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయడం జరిగింది .ఈ పూజకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో లో వైరల్ గా మారాయి. పూజ అనేది సహజమే కదా దాంట్లో వింతేముంది అంటారా..! పూజలో ఎలాంటి వింత లేకపోయినా వనిత విజయ్ కుమార్ మరియు తన కూతురు మెడలో నోట్ల తండాలు ఉండడం వల్ల ఈ ఫోటోలు వైరల్ గా మారింది.