హీరోని ముఖ్యమంత్రిని చేస్తున్నారు..!

NAGARJUNA NAKKA
కోలీవుడ్ లో విజయ్ కు ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఆయన పేరు చెబితే చాలు ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం అనే అభిమానులున్నారు. ఒక సినిమా హీరోగానే కాక.. ఆయన్ను వ్యక్తిగతంగా ఇష్టపడేవాళ్లూ ఉన్నారు. యూత్ ఫాలోయింగ్ బోలడెంత ఉంది. వరుస హిట్స్‌తో రజనీకాంత్‌ని కూడా వెనక్కి నెట్టేశాడు. హార్డ్‌ కోర్ ఫ్యాన్స్ అయితే దళపతి తమిళనాడు నెక్ట్స్‌ సీఎం అని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. రియల్ లైఫ్ లో సీఎంగా హీరోయిజం చూపించాలంటున్నారు.  


విజయ్‌కి 'మెర్శల్, సర్కార్' సినిమాల సమయంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు అభిమానులు, తమిళనాడు ప్రజలు మద్దతుగా నిలిచారు. సినిమాల్లో సామాన్యుల కోసం పోరాడుతున్నాడని, విజయ్ రియల్ స్టార్‌ అని ప్రశంసించారు. అయితే మద్రాస్‌ హై కోర్టు తీర్పు తర్వాత విజయ్‌పై విమర్శలు మొదలయ్యాయి.

విజయ్ 2012లో ఇంగ్లండ్‌ నుంచి రోల్స్‌ రాయిస్‌ ఘోస్ట్‌ కారుని ఇంపోర్ట్‌ చేసుకున్నాడు. అయితే ఈ కారుకి ఇంపోర్ట్ టాక్స్ కట్టిన విజయ్, తమిళనాడు ప్రభుత్వ పర్మిట్ టాక్స్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని హై కోర్టుని ఆశ్రయించాడు. దీనిపై జస్టిస్ ఎం.సుబ్రమణ్యం స్పందిస్తూ, పన్ను మినహాయింపు కోరడం అన్యాయమని పిటీషన్ కొట్టేశారు. అలాగే తెరపైనే 1కాదు, రియల్‌ లైఫ్‌లోనూ హీరోయిజం చూపించాలని వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధికి పన్నులు తోడ్పాటు ఎంతో అవసరమని చెప్పారు. అలాగే ఈ వ్యాజ్యం వేసినందుకు లక్ష రూపాయల జరిమానా విధించారు.

విజయ్ ప్రీవియస్ మూవీ 'మాస్టర్'కి 80 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నాడని టాక్. అంతేకాదు ఈ హిట్‌ తర్వాత విజయ్ వంద కోట్ల వరకు డిమాండ్‌ చేస్తున్నాడనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇంత సంపాదిస్తోన్న విజయ్, కారుకి పన్ను కట్టలేకపోతున్నాడా.. కోట్లు ఉన్న పేదవాడా అని విమర్శిస్తున్నారు జనాలు. చూద్దాం.. అభిమానులు ఆశించినట్టు విజయ్ సీఎం పీఠం మీద కూర్చుంటారో లేదో. తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు ఆసక్తిరకంగానే ఉంటాయి మరి.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: