దేవయాని రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి కారణం ఇదేనా..?
దేవయాని.. ఈమె పేరు వినగానే ముందుగా సుస్వాగతం సినిమా గుర్తొస్తుంది. సుస్వాగతం సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించి, తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది దేవయాని. ఇక అక్కడ తండ్రికి భయపడతూ.. ప్రేమించిన ప్రియుడిని కాదనలేక ఇబ్బందులు ఎదుర్కొనే పాత్రలో చక్కగా నటించి, అందరి చేత మంచి మన్ననలు పొందడమే కాకుండా.. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది దేవయాని. దేవయాని మహారాష్ట్రకు చెందిన నటి. ఈమె కేవలం తెలుగులోనే కాకుండా తమిళం ,మలయాళం, కన్నడ, బెంగాలి ,హిందీ వంటి పలు భాషా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
1996లో వచ్చిన " కాదల్ కొట్టై" సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్న ఈమె, తమిళనాడు రాష్ట్రం నుంచి రాష్ట్ర చలన చిత్ర పురస్కారాన్ని కూడా అందుకుంది. అంతేకాదు ఉత్తమనటిగా ఫిలిం ఫేర్ అవార్డు కూడా అందుకోవడం విశేషం. ఇక ఈమె టీవీ సీరియల్స్ లో కూడా నటించి, అక్కడ కూడా మంచి విజయాన్ని సాధించింది. ఇక 35 చిత్రాలకుపైగా హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న దేవయాని, ఆ తర్వాత తల్లి పాత్ర , అక్క పాత్ర , వదిన పాత్రలో నటించి అలరించింది.