మూడేళ్లుగా అత్యాచారం.. ప్రభాస్ ప్రొడ్యూసర్ పై కేసు.. !

MADDIBOINA AJAY KUMAR
సినిమా అంటేనే రంగుల ప్రపంచం. జీవితంలో స్క్రీన్ పై ఒక్కసారైనా కనిపించాలని ఎంతోమంది కలలు కంటూ ఉంటారు. ఒక్క ఛాన్స్ వస్తే బాగుండని తమ టాలెంట్ నిరూపించుకుని ఎక్కడికో వెళ్లి పోవచ్చు అని అనుకుంటారు. ఒక సినిమా సక్సెస్ అయితే ఇక తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదని భావిస్తారు. అయితే ఆ ఒక్క అవకాశం కోసమే ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. హీరోయిన్లు అయితే తమను కమిట్మెంట్ అడుగుతారని చెబుతుంటారు. కమిట్మెంట్ ఇచ్చి మోస పోయిన తర్వాత కొంత మంది పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే.... మరికొందరు ఇవేమీ పట్టించుకోకుండా లైట్ తీసుకుంటారు. కాగా తాజాగా ప్రముఖ నిర్మాత టీ సిరీస్ ఎండీ భూష‌న్ కుమార్ త‌న‌ను మోసం చేసాడంటూ ఓ న‌టి  పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కింది. తనపై మూడేళ్లుగా అత్యాచారం చేశాడంటూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించింది. తనకు 2017 లో అప్ కమింగ్ సినిమాల్లో ఒక దాంట్లో ఉద్యోగం ఇప్పిస్తానని మూడేళ్ళపాటు వాడుకున్నాడని నటి ఆరోపిస్తోంది. 

అలా మాయమాటలు చెప్పి మూడేళ్లుగా వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు సంచలన ఆరోపణలు చేసింది. ముంబైలోని అంధేరి నగర్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు నటి ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దీనిపై దర్యాప్తు జరిపించాల్సి ఉంది. అంతే కాకుండా ఈ సంచలన ఆరోపణ పై నిర్మాత భూషణ్ కుమార్ ఇప్పటివరకు స్పందించలేదు. ఇది ఇలా ఉండగా భూషణ్ కుమార్ ప్రస్తుతం పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అందులో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ఆదిపురుష్‌ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాకు మొత్తం ముగ్గురు నిర్మాతలు ఉన్నారు. వారిలో ఆదిపురుష్ సినిమా దర్శకుడు ఓం రౌత్, కిరణ్ కుమార్ తో పాటు భూషణ్ కుమార్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నారు. ఇలా ఉండగా టీ సిరీస్ ను గుల్ష‌న్ కుమార్ స్థాపించారు. ఆయన పెద్ద కుమారుడు అయిన భూషణ్ కుమార్ ప్ర‌స్తుతం టీసిరీస్ ఎండిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భూషణ్ కుమార్ కు నటి దివ్యా కొస్లా తో వివాహం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: