జూనియర్ స్పీడ్ తో రానా పై పెరిగిపోతున్న ఒత్తిడి !

Seetha Sailaja
రాబోయే సెప్టెంబర్ అటు ధియేటర్లకు ఇటు బుల్లి తెర కు అత్యంత కీలకంగా మారబోతోంది. ఆగష్టు నుండి క్రేజీ సినిమాల విడుదల ప్రారంభం అవుతూ ఉండటంతో సెప్టెంబర్ లో వచ్చే వినాయకచవితి కి విడుదల అవ్వాలని భారీ సినిమాలు ‘అఖండ’ ‘ఆచార్య’ మూవీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.


అదే వినాయకచవితి నుండి బుల్లితెర పై తమ హడావిడి ప్రారంభించాలని రెండు క్రేజీ రియాలిటీ షోలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో ఎపిసోడ్స్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. ఈషో మొదటి వారంలోనే హాట్ చైర్ పై రామ్ చరణ్ కూర్చుంటాడని చరణ్ అతిధిగా పాల్గొనే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది అంటున్నారు.అయితే ఈ ఎపిసోడ్ ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలకు ముందు టెలికాష్ట్ చేస్తారా లేదంటే ముందుగానే టెలికాష్ట్ చేస్తారా అన్న కన్ఫ్యూజన్ కొనసాగుతోంది.


ఇక ‘బిగ్ బాస్ సీజన్ 5’ కౌంట్ డౌన్ కూడ ప్రారంభం అయింది అని అంటున్నారు. గత సంవత్సరం ‘స్టార్ మా’ నిర్వహించిన 'బిగ్ బాస్ సీజన్ 4’ ఇండియన్ టెలివిజన్ స్క్రీన్ పై అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ తెచ్చుకున్న షో గా నిలిచి రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. 'బిగ్ బాస్ 5' కోసం అందరూ ఆశక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితులలో అధికారికంగా ప్రకటించనప్పటికీ ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ చివరి దశకు వచ్చిందని టాక్ నడుస్తోంది.


దీనికితోడు త్వరలోనే ‘బిగ్ బాస్ సీజన్ 5’ అనౌన్స్ మెంట్ రాబోతోంది అని అంటున్నారు. రానా హోస్ట్ చేస్తున్నట్లుగా ఈ టీజర్ షూటింగ్ త్వరలో పూర్తి చేసి ఈ షోను కూడ సెప్టెంబర్ నుండే ప్రారంభించాలని చూస్తున్నారు. అదే జరిగితే బుల్లితెర పై ఈ రెండు షోల నిర్వాహణలో జూనియర్ రానా ల మధ్య తీవ్రమైన పోటీ ఉండటమే కాకుండా వీరిద్దరిలో ఎవరు బాగా రాణించారు అన్న చర్చలు ప్రారంభం అవుతాయి. అదే జరిగితే రానా కు కొంత వరకు ఊహించని తలనొప్పులు ఎదురౌతాయి అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: