స్టార్ హీరోల మధ్య పోటీ అనేది ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఇది కేవలం హీరో అభిమానులకు మాత్రమే కాకుండా సినీ అభిమానులు కూడా మంచి కిక్కు నీ ఇస్తుంది . ఇలాంటి సంఘటనలు ఎన్నో తెలుగు సినీ పరిశ్రమలో జరిగిన ఇప్పుడు మనం ఒక దాని గురించి మాట్లాడుకుందాం. అది 1996వ సంవత్సరం జనవరి 5వ తేదీ బాలకృష్ణ హీరోగా నటించిన శరత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'వంశానికొక్కడు' నాగార్జున హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'వజ్రం' సినిమా లు ఒకేరోజు విడుదల అయ్యాయి.
ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్న సమయంలోనే వారం గ్యాప్ లో విక్టరీ వెంకటేష్ హీరోగా 'భాషా' సినిమాతో ఇండియా లెవల్లో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సురేష్ కృష్ణ దర్శకత్వంలో 'ధర్మ చక్రం' సినిమా విడుదలయ్యింది. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడతారు అని సినీజనాలు అభిప్రాయపడ్డారు. దానికి ప్రధాన కారణం ఈ సినిమాలకు దర్శకత్వం వహించిన వారందరూ ఆ సమయంలో టాప్ డైరెక్టర్లు కావడం .
ఈ పోరు ఇలా నడుస్తున్న సమయంలోనే ఎవరు ఊహించని విధంగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా నటించిన 'పెళ్లి సందడి' సినిమా విడుదలైంది మొదట జనాలు అంతగా ఆసక్తి చూపకపోయినా ఈ సినిమాలో ఉన్న పాటలు ,హీరో హీరోయిన్ల మధ్య జరిగే సన్నివేశాలు , కుటుంబం మొత్తం కలిసి చూసే విధంగా ఈ సినిమాను తెరకెక్కించడం తో మంచి టాక్ తో దూసుకుపోయింది . ముగ్గురు స్టార్ హీరోల సినిమాలను ను పక్కకు నెడుతూ టాప్ ప్లేస్ లో నిలిచింది. మిగతా మూడు సినిమాలలో వంశానికొక్కడు, ధర్మచక్రం సూపర్ హిట్ సినిమాలు కాగా, ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'వజ్రం' సినిమా అభిమానులను నిరుత్సాహ పరిచింది. దీనిని ఒక అరుదైన సంఘటనగా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.