డైరెక్టర్ కానున్న ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ ...
అతనెవరో కాదు బాలీవుడ్ ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా. ఇతను స్టార్ హీరో మరియు హీరోయిన్లకు డిజైనర్ గా పని చేశారు. మనీష్ దాదాపు 30 సంవత్సరాల నుండి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇతని కెరీర్ లో నేటికి 800 సినిమాలకు కాస్ట్యూమ్ మరియు స్టైలింగ్ విషయంలో డిజైనర్ గా పనిచేసిన అనుభవం ఉంది. అయితే మనీష్ కు ఎప్పటి నుండో డైరెక్టర్ అవ్వాలని కోరిక ఉండేదట, కానీ దానికి ఒక బ్యాక్ గ్రౌండ్ ఉండాలనే ఉద్దేశ్యంతో ఇలా ఫ్యాషన్ డిజైనర్ గా ఫేమస్ అయ్యాక ట్రై చేస్తున్నాడు. అంతే కాకుండా బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత మరియు దర్శకుడు అయిన కరణ్ జోహార్ కు ఇతను ఫ్రెండ్ కావడం విశేషం.
ఇంకేముంది మనీష్ ఖచ్చితంగా డైరెక్టర్ గా రాణిస్తాడని నెటిజన్లు అనుకుంటున్నారు, ఎందుకంటే బాలీవుడ్ రంగం కరణ్ జోహార్ చేతుల్లో ఉంటుంది కాబట్టి. మొదటి సినిమానే ఒక పీరియాడిక్ డ్రామాను డైరెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన కథ కూడా ఇప్పటికే రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు నిర్మాత కూడా కరణ్ జోహార్ కావడం వలన ఈ వార్త అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి డిజైనింగ్ రంగంలో ఆకట్టుకున్న మనీష్ డైరెక్టర్ గానూ సక్సెస్ కాగలడా ? తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే...