రేపటి నుండే థియేటర్లు ఓపెన్... శుభారంభం ఇస్తాయా ?
దాంతో ఫ్యాన్స్ కు లడ్డూ లాంటి వార్తను అందించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఆదివారం నుండి రాష్ట్రంలో సినిమా థియేటర్లను తిరిగి ఓపెన్ చేయాలని డిసైడ్ చేసింది రాష్ట్ర ఎగ్జిబిటర్ల అసోసియేషన్. ఈ నెల 23 నుంచి థియేటర్లలో నూతన సినిమాలు సందడి చేయనున్నాయి. 100 శాతం సీటింగ్ సామర్థ్యంతో రేపటి నుంచి మళ్లీ అన్ని థియేటర్లు పూర్వ వైభవం పుంజుకుని కళకళలాడనున్నాయి. అయితే కరోనా నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోనున్నారు. అయితే ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉన్న చిత్రాలన్ని ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రావాలా అన్న ప్లానింగ్ సంసిద్ధం చేసుకుంటున్నాయి.
అయితే చాలా కాలం తరువాత సినిమాలు థియేటర్ లలో సందడి చేయనుండడంతో ఆశించిన ఆరంభాన్ని అందిస్తాయా అన్నది చూడాల్సి ఉంది. ఎప్పటి లాగే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారా లేదా కరోనా థర్డ్ వేవ్ వస్తుందన్న భయంతో నిర్మాతలకు షాక్ ఇస్తారా తెలియాలంటే కొద్ది రోజులు ఆగక తప్పేలా లేదు.