ఎన్టీఆర్ 30వ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్స్?

murali krishna

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఎన్టీఆర్ 30వ సినిమా తెరకెక్కబోతున్న విషయం  తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్ నటిస్తున్న rrr చిత్ర  షూటింగ్  రెండు పాటలు  మినహా  మిగిలిన టాకీ  పార్ట్ మొత్తం పూర్తి అయింది.RRR చిత్ర  షూటింగ్ పూర్తి కాగానే వెంటనే కొరటాల శివ డైరెక్షన్లో  చిత్ర షూటింగులో పాల్గొనాలని ఎన్టీఆర్ చూస్తున్నాడు.కొరటాలశివ కూడా ఆచార్య  చిత్ర  షూటింగులో బిజీగా ఉన్నాడు.ఆ చిత్ర  షూటింగ్ పూర్తి  అయిన వెంటనే  ఎన్టీఆర్ చిత్ర షూటింగ్ ప్రారంభించాలి అనుకుంటున్నాడు.ఎన్టీఆర్ బిగ్ స్క్రీన్ మీద  కనిపించి  ఇప్పటికే  దాదాపు రెండున్నరేళ్లు పూర్తి కావస్తుంది. ఈ  గ్యాప్ ని దూరం  చేసేందుకు ఎన్టీఆర్ బుల్లితెరపై కనిపించనున్నాడు. ఎవరు  మీలో కోటీశ్వరుడు షో ద్వారా ఆడియన్స్ ను కనువిందు చేయనున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ ఆ  షో షూటింగులో పాల్గొంటున్నాడు.ఇదిలా ఉండగా  ఎన్టీఆర్, కొరటాల శివ  కాంబినేషనులో రోబోయే చిత్రంలో ఎన్టీఆర్ ఒక  యంగ్ హీరోతో స్క్రీన్ షేర్  చేసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.ఇప్పటికే కొరటాల దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్  చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహనలాల్ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. మళ్ళీ కొరటాల శివ చిత్రంలోనే  ఒక యంగ్ హీరో కీలక పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం.

ఎన్టీఆర్,కొరటాల కాంబినేషనులో  వచ్చిన జనతా గ్యారేజ్  చిత్రం ఘన విజయం సాధించింది. ఎన్నో రికార్డులు తిరగరాసింది. రాబోయే చిత్రం ఎన్ని రికార్డులు తిరగరాస్తుందో  చూడాలి.జనతా గ్యారేజ్ లో కొరటాల శివ ఎన్టీఆర్ ని ఒక మాస్ క్యారెక్టర్ లో చూపించాడు. రాబోయే చిత్రంలో ఎన్టీఆర్ ని రాజకీయ నాయకుడిగా చూపించాబోతున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ క్యూట్ హీరోయిన్
కియారా అద్వానీ నటించబోతునట్లు సమాచారం అందింది. మరొక హీరోయిన్ గా రష్మిక మందన నటించబోతున్నట్లు సమాచారం. కియారా అద్వానీ మహేష్, కొరటాల మూవీ భరత్ అను నేను లో నటించింది. తన యాక్టింగ్ కి ఫిదా అయిన కొరటాల శివ ఎన్టీఆర్ మూవీలో కూడా తనని రిపీట్ చేయాలనీ భావిస్తున్నాడు. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తీసేందుకు నిర్మాతలు మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణరామ్ ఉన్నట్లు సమాచారం.ఈ సినిమాను కొరటాల  మాస్ ఎలిమెంట్స్ తో పవర్ ఫుల్ డైలాగ్స్ తో నింపనున్నట్లు టాక్ వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: