గోపీచంద్ 30.. బొమ్మ మల్టీస్టారరట..!

shami
మాస్ హీరో కౌటట్ ఉన్న గోపీచంద్ ముందు కెరియర్ హీరోగా చేసి విలన్ గా మెప్పించి మళ్లీ హీరోగా క్లిక్ అయ్యాడు. మాస్ హీరోగా గోపీచంద్ కెరియర్ మొదట్లో మంచి హిట్లు అందుకున్నా ఈమధ్య రేసులో వెనకపడ్డాడు. ముఖ్యంగా తన మాస్ పంథా మార్చుకుని ఎంటర్టైనింగ్ సినిమాలు చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావట్లేదు. కొన్నాళ్లుగా గోపీచంద్ హిట్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా సరే సరైన హిట్ దక్కలేదు. ఈ క్రమంలో కొద్దిగా గ్యాప్ తీసుకుని ఒకేసారి మూడు ప్రాజెక్టులతో వస్తున్నాడు.

ఆల్రెడీ సంపత్ నంది డైరక్షన్ లో సీటీమార్ సినిమా చేస్తున్న గోపీచంద్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఆ సినిమాతో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. టీజర్ చూస్తే సినిమాలో ఆల్రెడీ విషయం ఉన్నట్టే ఉంది. ఇక ఈ సినిమాతో పాటుగా మారుతి డైరక్షన్ లో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్న గోపీచంద్ ఈ సినిమాతో కూడా భారీ అంచనాలతో వస్తున్నాడు. ఇక లేటెస్ట్ గా గోపీచంద్ 30వ సినిమా శ్రీవాస్ డైరక్షన్ లో ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాకు సంబందించిన లేటెస్ట్ న్యూస్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది.

శ్రీవాస్ ఈ సినిమాను మల్టీస్టారర్ గా ప్లాన్ చేశారట. సినిమాలో గోపీచంద్ తో పాటుగా రాజశేఖర్ కూడా ఉంటారని టాక్. శ్రీవాస్, గోపీచంద్ కాంబినేషన్ లో వచ్చిన లక్ష్యం సినిమాలో జగపతి బాబు ఇంపార్టెంట్ రోల్ చేశారు. ఇప్పుడు ఆ ఛాన్స్ రాజశేఖర్ కు ఇస్తున్నట్టు తెలుస్తుంది. అయితే గోపీచంద్ 30లో రాజశేఖర్ విలన్ గా చేస్తారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో చిత్రయూనిట్ వెల్లడించాల్సి ఉంది. గోపీచంద్ రాజశేఖర్ ఈ కాంబినేషన్ ఆడియెన్స్ కు ఎలాంటి ట్రీట్ అందిస్తుందో చూడాలి. గోపీచంద్ ఈ మూడు సినిమాలతో ఎలాగైనా సరే హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: