పుష్ప లో అదిరిపోయే ట్విస్ట్ అదేనా .. ??
గంధపు చెక్కల స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో భారీ స్థాయి అత్యున్నత విలువలతో రూపొందుతున్న ఈ సినిమాపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించడంతో పాటు అది సినిమా పై అంచనాలు మరింతగా పెంచింది. ఫహద్ ఫాసిల్ మెయిన్ విలన్ గా యాక్ట్ చేస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ తో పాటు పలు ఇతర భాషల నటులు కూడా ముఖ్య పాత్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక అసలు విషయం ఏమిటంటే లేటెస్ట్ గా కొన్ని ఫిలింనగర్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు టాక్. మొదటి భాగం క్లైమాక్స్ లో ఒక పెద్ద ట్విస్ట్ తో హీరో సెకండ్ క్యారెక్టర్ రివీల్ అవుతుందని, దానితో మొదటి పార్ట్ ముగిసిన అనంతరం రెండవ పార్ట్ లో ఆ సెకండ్ క్యారెక్టర్ సాగుతుందని అంటున్నారు. మొత్తంగా అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా రెండు భాగాల్లోని అల్లు అర్జున్ రెండు క్యారెక్టర్స్ ని దర్శకుడు సుకుమార్ ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే దీనిపై అఫీషియల్ న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే .... !!