మెగా హీరో సినిమాలో ఇలియానా ?

VAMSI
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆచార్య షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ అందాల నడుమున్న సుందరి ఇలియానాతో ఆడిపాడనున్నాడని  తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో ఎక్కువగా కనిపించిన ఈ భామ ఇప్పుడు తిరిగి తనను స్టార్ ను చేసిన తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా క్రేజ్ పెంచుకున్న ఈ ముద్దుగుమ్మకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంది. అయితే ఇప్పుడు ఇలియానా అగ్ర కథానాయకుడు రామ చరణ్ సినిమాలో కనిపించబోతోంది అంటూ వార్తలు వినపడతున్నాయి. త్వరలో చెర్రీ శంకర్ దర్శకత్వంలో ఓ ప్రతిష్టాత్మక చిత్రం చేయునున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో రామ్ చరణ్ తో స్టెప్పులు వేయనుంది ఇలియానా సుందరి అంటూ వార్తలు వినపడుతున్నాయి. ఇప్పటి వరకు తెరపై కనిపించని ఈ క్రేజీ కాంబో ఇప్పుడు తొలిసారిగా ఊపున్న పాటతో కదలివస్తే ఇక అంతా రచ్చ రచ్చే.. ఆ కిక్కే వేరప్ప అంటున్నారు మెగా అభిమానులు. అయితే ఇంకా ఈ అంశం ఎంతవరకు నిజమనే విషయం అధికారికంగా తెలియాల్సి ఉంది.  తెలుగు  ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇలియానా. వంపులు తిరిగిన వయ్యారంతో ముఖ్యంగా తన నడుము అందాలతో యువతను కట్టిపడేసింది ఈ హీరోయిన్. ఒకప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా అందరి అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుని సక్సెస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.
మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా టాలీవుడ్ టాప్ హీరోలందరి తోను జతకట్టి స్టార్ హీరోయిన్ గా అభిమానుల గుండెల్లో  గూడుకట్టుకున్న అందం అభినయం ఉన్న ఈమె అందాల ప్రదర్శనకు కూడా ముందుండేది. అయితే గత కొంతకాలం క్రితం ఇలియానా టాలీవుడ్  కు దూరమైన సంగతి తెలిసిందే. కాగా అందిన అవకాశాలను అందిపుచ్చుకుని తన స్పీడ్ మళ్లీ పెంచాలని భావిస్తోందట ఈ మెరుపుతీగ. మరి మునుపటిలాగే స్పీడ్ అందుకుంటుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: