ప్రముఖ టీవీ 'షో' జబర్దస్త్ 8 ఏళ్ళ క్రితం ఒక మామూలు టీవీ 'షో' గా ప్రారంభమయ్యింది. తర్వాత టాప్ 'టి ఆర్ పి' రేటింగ్ రావడంతో కేవలం గురువారం మాత్రమే 'జబర్దస్త్' పేరుతో వచ్చే ఈ ప్రోగ్రాం ని 'ఎక్స్ ట్రా జబర్దస్త్' పేరుతో శుక్రవారం రోజుకు కూడా పొడిగించారు. ఈ షో మొదలు పెట్టినప్పుడు ధనరాజ్, వేణు ,చంద్ర మరికొంతమంది కమెడియన్ లతో ప్రారంభించారు. ఆ తర్వాత వీరికి సినిమా అవకాశాలు రావడంతో ఈ 'షో' నుండి బయటికి వచ్చారు.
ఇలా ఎప్పటికప్పుడు టీం లీడర్లు మారుతూ ఆర్టిస్ట్ లు మారుతున్న జబర్దస్త్ లో ప్రారంభమైనప్పటి నుండి ఉన్న ఏకైక టీం లీడర్ 'రాకెట్ రాఘవ' మాత్రమే అని చెప్పవచ్చు. జబర్దస్త్ వల్ల అవకాశాలు వచ్చి బయటకు వెళ్లిన వారు కొంతమంది అయితే గొడవల వల్ల కూడా బయటకు వెళ్లిన వారు ఉన్నారు అని వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ లో గెటప్ శ్రీను ను జబర్దస్త్ లో ఉన్న టీం సభ్యుల మధ్య గొడవల కారణంగా ఎంతోమంది బయటకు వచ్చేశారు. మీ టీం లో మాత్రం మీరు, సుధీర్ ,రాంప్రసాద్ విడిపోకుండా ఉండడానికి కారణం ఏంటి అని అడగగా. మేము కూడా గొడవలు పడతాం కాకపోతే దానిని తీవ్రస్థాయికి తీసుకెళ్లాం. మేము ఏదైనా 'ఈవెంట్' కి వెళ్ళినా కూడా అందరూ మమ్మల్ని అన్నా మీరు ముగ్గురు కలిసి కామెడీ చేస్తే చాలా బాగుంటుంది.
మీరు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి. మీలా ఎవరూ కలిసి ఉండరు .అని అంటూ ఉంటారు. దానితో మాకు భయం కూడా వేస్తోంది . అందుకే అందరికీ నచ్చే విధంగా కలిసి ఉండాలని అనుకుంటాం. సన్నీ కూడా చాలా మంచి వ్యక్తి ఎలాంటి క్యారెక్టర్ ని అయినా బాగా చేయగలడు. కొన్ని సందర్భాలలో ఎలాంటి డైలాగులు లేకుండా క్యారెక్టర్ ఇచ్చిన కూడా ఏమాత్రం బాధపడకుండా చేస్తాడు. అని గెటప్ శీను చెప్పాడు.