ఆ హీరోయిన్ ప్రేమ కోసం స్టార్ హీరో అంత కష్టపడ్డాడా..?
తనని ప్రేమిస్తున్న టైం లో తన వెంట తిరగడం అది సినిమా కోసమే అయినా భలే సరదా అనిపించిందని చెప్పుకొచ్చారు ఫహద్ ఫాజిల్. అంతేకాదు ఫైనల్ గా ఆమె ప్రేమని పొంది ఇద్దరు ఎంచక్కా పెళ్లితో ఒక్కటయ్యారు కూడా. ఫహద్ ఫాజిల్, నజ్రియా అందరిని ఆకట్టుకుంటున్న జంట. మళయాళ భామ నజ్రియా చేసింది తక్కువ సినిమాలే అయినా ఆమె మాత్రం యూత్ ఆడియెన్స్ లో ఓ సెపరేట్ క్రేజ్ తెచ్చుకుంది. పెళ్లి తర్వాత కూడా నజ్రియా సినిమాలను చేస్తుంది.
ఇక ఫహద్ ఫాజిల్ విషయానికి వస్తే తన విలక్షణ నటనతో సౌత్ లో క్రేజీ స్టార్ గా మారాడు. ముఖ్యంగా తను నటించిన మళయాళ సినిమాలన్ని తెలుగులో ఆహా డబ్ చేసి రిలీజ్ చేస్తుంది. దానితో టాలీవుడ్ లో ఫహద్ ఫాజిల్ కు ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఏర్పడుతుంది. ప్రస్తుతం పుష్ప సినిమాలో విలన్ గా చేస్తున్నాడు ఫహద్ ఫాజిల్ ఆహాతో తెలుగులో వచ్చిన ఈ క్రేజ్ పుష్ప సినిమాకు చాలా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. ఎలాంటి పాత్ర అయినా నేను చేసేందుకు రెడీ అంటున్న ఫహద్ ఫాజిల్ పుష్పతో టాలీవుడ్ లో తన మార్క్ చూపించాలని చూస్తున్నాడు. కచ్చితంగా అతనికి తెలుగులో మంచి మార్కెట్ వస్తుందని మాత్రం చెప్పొచ్చు.