హీరో కార్తీ
తమిళ సినిమాలతో వెండితెరకు పరిచయమైన యుగానికి ఒక్కడు , ఆవారా , ఖాకి ,
ఖైదీ సినిమాలతో తెలుగులో స్టార్ హీరోల రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ
హీరో హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా నటనకు ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న పాత్రలు మాత్రమే ఎంచుకుని చేస్తూ ఉంటాడు.
సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కూడా తన నటనతో తనకంటూ ఒక ప్రాముఖ్యతను తెచ్చుకున్నాడు. ఈ
హీరో నుంచి ఆఖరుగా వచ్చిన
సినిమా 'సుల్తాన్' జనాలను నిరాశపరచింది.
ప్రస్తుతం
కార్తి పి. ఎస్. మిత్రాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సర్దార్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రాశికన్నా
హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ
సినిమా షూటింగ్ వద్ద ఒక సంఘటన చోటు చేసుకుంది. సర్దార్
సినిమా షూటింగ్ 2 కోట్లతో వేసిన ఒక భారీ సెట్లో జరుగుతోంది. ఈ
సినిమా షూటింగ్ సమీపంలోనే
విజయ్ హీరోగా దర్శకుడు నెల్సన్ తెరకెక్కిస్తున్న 'బీస్ట్'
సినిమా కూడా షూటింగ్ జరుపుకుంటోంది. కాసేపు కార్తీ కి షూటింగ్ లో విరామం దొరకడంతో 'సర్దార్'
సినిమా గెటప్ లోనే
విజయ్ సినిమా షూటింగ్ స్పాట్ కు వెళ్ళాడు .కానీ
విజయ్ కార్తీ ని చూసి ఎవరో అనుకొని కొంతసేపు గుర్తుపట్టలేదు.
కాసేపు అయిన తర్వాత గుర్తుపట్టి ఈ గెటప్ లో ఎవరో అనుకున్నాను. అని చెప్పి కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు అని సమాచారం. 'బీస్ట్' సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని ఇప్పటికే విడుదల చేయగా జనాల నుంచి మంచి ఆదరణ పొందింది. ఇక 'సర్దార్'
సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది. ఈ
సినిమా విడుదల తేదీని చిత్రబృందం మరికొద్ది రోజుల్లో తెలియజేసే అవకాశం ఉంది. ఈ సినిమాతో
కార్తి 'కం బ్యాక్' అవుతాడో లేదో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.