వరుణ్ తేజ్ తో త్రివిక్రమ్ ఫైనల్ చేశాడా..?

Pulgam Srinivas
యంగ్ హీరో వరుణ్ తేజ్ 'ముకుంద' సినిమా తో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా థియేటర్ల వద్ద పెద్దగా ప్రభావం చూపకపోయినా హీరో నటనకు మాత్రం సినీ జనం నుండి  మంచి మార్కులే పడ్డాయి. ఈ హీరో ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలు చేయకుండా తన పాత్రకు ప్రాధాన్యం ఉండే కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకొని మరి చేస్తాడు. అందులో భాగంగానే తొలిప్రేమ, ఫిదా లాంటి క్లాస్ పాత్రలు చేస్తూనే 'గద్దల కొండ గణేష్' లాంటి పవర్ ఫుల్ పాత్రలో కనిపించి ఏ పాత్ర అయినా వరుణ్ తేజ్ చేయగలడు అని విమర్శకుల చేత ప్రశంసలు పొందాడు. 


అయితే ఈ యంగ్ హీరో ప్రస్తుతం కిరణ్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గని' అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలో నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ఈ మెగా హీరో ఏ  సినిమా చేస్తాడు. అని అందరూ అనుకుంటున్నా  సమయంలో   తెలుగు టాప్ దర్శకులలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ లాక్ డౌన్ సమయంలో వరుణ్  తేజ్ కు ఒక కథ వినిపించినట్టు, ఆ కథకు వరుణ్ తేజ్ కూడా ఓకే చెప్పినట్టు , ఈ కథలో వరుణ్ తేజ్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉన్నట్టు ఫిల్మీ దునియా గుసగుసలు వినబడుతున్నాయి.


ఈ వార్త నిజమే అయితే వరుణ్ తేజ్ యాక్టర్ గా మరొక మెట్టు ఎక్కుతాడు అని సిని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దానికి ప్రధాన కారణం త్రివిక్రమ్ హీరోలను చాలా కొత్తగా స్టైలిష్ గా చూపించడమే. ఇక త్రివిక్రమ్ కూడా ఏ సినిమాను అధికారికంగా ప్రకటించక పోవడంతో ఈ వార్త నిజమే కావచ్చు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తాడు అని వార్తలు వచ్చినప్పటికీ కూడా దానిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు .మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: