ఆ హీరోతో రొమాన్స్.. ఎంతవరకు దారితీస్తుందో..?

NAGARJUNA NAKKA
హీరోయిన్ల కెరీర్ అయోమయంగా ఉంటోంది. వాళ్లు నటించే సినిమా హిట్ అయితే ఓకే.. ఫట్ అయితేనే పెద్ద ఫ్లాబ్లమ్. తొలి సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కితే ఆ భామలకు ప్రేక్షకుల్లో అదే టాక్ ఉంటోంది. ఒక వేళ ఫెయిల్ అయితే ఫ్లాప్ హీరోయిన్ గా ముద్ర పడిపోతోంది. ఇలా హీరోయిన్ల సినీ కెరీర్ డైలమాలో ఉంటోంది. అందుకే హీరోయిన్లు సినిమా విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎవరితో జత కడితే.. తమకు మంచి పేరు వస్తుందోనని లెక్కలేసుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రచించడమే కాకుండా.. స్టోరీ ఎంపిక విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరితో రొమాన్స్ చేయాలో కూడా వాళ్లే డిసైడ్ చేసుకుంటూ అందులో పండించేస్తున్నారు. మరి అది ఎంతవరకు దారితీస్తుందో.. అది నిర్ణయించాల్సింది ప్రేక్షకులే. ఇపుడు నభా నటేష్ పరిస్థితి కూడా అలాంటిదే.


ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో 'ఇస్మార్ట్ శంకర్'లో రొమాన్స్ చేసిన నభా నటేశ్‌కి అవకాశాలు వెల్లువెత్తాయి. చాందిని రోల్‌లో ఫుల్ మాస్‌గా కనిపించి యూత్‌ ఆడియన్స్ కు బాగా దగ్గరయింది. యంగ్‌ హీరోలతో పాటు సీనియర్ హీరోలతోనూ మూవీస్ చేసింది. 'డిస్కోరాజా'లో రవితేజతో కలిసి ఆడిపాడింది. నభా నటేశ్‌ 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత చేసిన సినిమాలు ఊహించిన విధంగా సక్సెస్ సాధించలేదు. 'డిస్కోరాజా' ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంటే..'సోలో బ్రతుకే సో బెటర్'కి పర్వాలేదని పించింది.  ఇక బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో కలిసి చేసిన 'అల్లుడు అదుర్స్' నభాని ఊహించని షాక్ కు గురిచేసింది.

నభా నటేశ్ ప్రస్తుతం నితిన్‌తో కలిసి 'మ్యాస్ట్రో' సినిమా చేస్తోంది. 'అంధాదున్' రీమేక్‌గా వస్తోన్న ఈ మూవీలో రాధిక ఆప్టే క్యారెక్టర్‌ని రీప్లేస్ చేస్తోంది నభ. ఇక గ్రాఫ్ పడిపోతోన్న సమయంలో ఈ 'మ్యాస్ట్రో' సినిమాపై నభ చాలా హోప్స్‌ పెట్టుకుంది. మరి 'మ్యాస్ట్రో' నభ కెరీర్‌ని ఎటువైపు తీసుకెళ్తాడో చూడాలి. నితిన్ తో రొమాన్స్ ను యాక్సెప్ట్ చేస్తారో లేదో మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: