స్విట్జర్లాండ్లో తొలి తెలుగు సినిమా షూటింగ్... మెగాస్టార్దే ఆ క్రెడిట్ ?
తెలుగు సినిమాలు అన్ని చాలా వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రామోజీ ఫిలిం సిటీ లో మాత్రమే షూటింగ్ జరుపుకునే వి. అప్పట్లో సినిమా సాంగ్స్ కోసం మాత్రమే విదేశాలకు వెళ్లేవారు. స్విట్జర్లాండ్ లోని మంచు కొండల్లో పాటల షూటింగ్ అంటే అప్పట్లో ఓ సంచలనం. బాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాలను అప్పట్లో ఆ మంచు కొండల పై షూట్ చేసేవారు. అయితే తొలిసారిగా మెగా స్టార్ చిరంజీవి నటించిన రౌడీ అల్లుడు సినిమాలో సాంగ్స్ షూట్ చేసేందుకు తొలిసారి వెళ్లారు.
స్విట్జర్లాండ్ లో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు సినిమాగా రౌడీ అల్లుడు రికార్డులకు ఎక్కింది. ఆ సినిమాలో చిరంజీవి - శోభన డ్యాన్స్ చేసిన చిలుకా క్షేమమా సాంగ్ ను దర్శకుడు కె.రాఘవేంద్రరావు అక్కడ మంచుకొండల్లో చిత్రీకరించారు. ఆ తర్వాత ఆ సినిమా నుంచి స్ఫూర్తి పొంది ఎన్నో సినిమాలు విదేశాల్లో షూటింగ్ చేసుకున్నాయి. రౌడీ అల్లుడు సినిమా నుంచే ఈ ట్రెండ్ ఎక్కువుగా స్టార్ట్ అయ్యింది. అలా ఈ ఘనత చిరంజీవి ఖాతాలో పడింది.