విక్టరీ వెంకటేశ్ ఇరగదీశాడు. నారప్పగా ఆయన నటన అమోఘం. గ్రామీణ ప్రాంతంలో..
రాయలసీమ యాసలో.. అద్భుతంగా యాక్ట్ చేశాడు. ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. గ్రామంలో డబ్బున్నోళ్లు.. లేనోళ్లకు మధ్య ఉన్న తారతమ్యాన్ని అద్భుతంగా చూపించారు దర్శకుడు
శ్రీకాంత్ అడ్డాల. అంతేకాదు డబ్బున్నోళ్లు.. లేనోళ్లను ఎంత హీనంగా చూస్తారో కళ్లకు కట్టారు. అంతేకాదు భూహక్కుల గురించి స్పష్టంగా చూపించారు. దురాచారానికి ఎదురు తిరిగే క్యారెక్టర్ లో వెంకటేశ్ అద్భుత
నటన చూపించారు. తన కొడుకును పొట్టనబెట్టుకున్న వ్యక్తిని మరొక కొడుకు చంపేయగా.. దీంతో ఫ్యామిలీ చెల్లచెదురు అయిపోతుంది. వెంకటేశ్ పెద్ద కొడుకును చంపిన వ్యక్తిని రెండో కొడుకు చంపేస్తాడు. దీంతో వెంకటేశ్ ఫ్యామిలీ చెల్లాచెదరు అయిపోతుంది. వెంకటేశ్ తన కొడుకుతో కలిసి అడవుల్లోకి పారిపోతాడు. పోలీసులు, రౌడీల కంటపడకుండా జాగ్రత్త పడతాడు.
మరోవైపు తన సతీమణిగా నటించిన
ప్రియమణి తన కూతురుని తీసుకొని ఇతరుల ఇంట్లో తల దాచుకుంటుంది.
రాజీవ్ కనకాల నటన కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. అడవుల్లో వేటసాగించే ప్రభాకర్.. అడవుల్లోకి వెళ్లిన వెంకటేశ్.. వెంకటేశ్ కొడుకు క్యారక్టర్ లో నటించిన అబ్బాయి కోసం వేటకుక్కలతో తీవ్రంగా గాలిస్తాడు. చివరకు
ప్రభాకర్ ముఠాకు చిక్కడంతో పెద్ద ఫైట్ జరుగుతుంది. తన పెద్ద కొడుకును
ప్రభాకర్ చంపాడని తెలిసినా.. చంపకుండా వదిలేసి వెళ్లిపోతాడు. అప్పుడు తన గతాన్ని తన కొడుకుకు వివరిస్తాడు. తాను
సారా కాసుకునే వ్యక్తినని చెబుతాడు. అలా
సినిమా చాలా ఇంట్రెస్టింగ్ మూడ్ లోకి వెళ్లిపోతుంది.
నారప్పతో హిట్ కొట్టిన
శ్రీకాంత్ అడ్డాల.. మరో రిస్కీ ప్రాజెక్ట్ దిశగా అడుగులు వేస్తున్నాడు.
అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా..
గీతా ఆర్ట్స్ బేనర్లో అన్నాయ్ అనే ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు. మూడు పార్ట్ లుగా ఈ
సినిమా తెరకెక్కనుంది.
నారప్ప ఇచ్చిన బూస్ట్ తో చెలరేగిపోనున్నాడు
శ్రీకాంత్ అడ్డాల.
.