డైరెక్టర్ వంశీ మొదటి ఎక్కడ పని చేసేవారు..?
ఇక అలాంటి వారిలో డైరెక్టర్ వంశీ కూడా ఒకరు. అయితే సినీ ఇండస్ట్రీ లోకి రాకముందు ఏం చేసేవారు అనే విషయాలను తెలుసుకుందాం. ఇక వంశీ సినీ ఇండస్ట్రీలోకి ఎవరు సపోర్ట్ లేకుండా సోలోగా అడుగుపెట్టి , తన సత్తా ఏంటో చాటుకున్నాడు. నిజానికి వంశీ ఒక గొప్ప రచయిత. తన 16 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే రాయడం మొదలుపెట్టాడు. అలా ఆంధ్రజ్యోతి దిన పత్రిక కు రైటర్ గా పనిచేస్తున్న సమయంలో, ఒక ఆయన నువ్వు పని చేయాల్సింది ఇక్కడ కాదు ..నాతో పాటు పద అని చెన్నై కి తీసుకెళ్లారు.
అయితే వంశీ అప్పటికే మంచుపల్లకి, కర్మసాక్షి అనబడే రెండు పెద్ద పుస్తకాలను రాయడం జరిగింది. ఈ పుస్తకాలను ఒక డైరెక్టర్ కి చూపించగా ఆయన ఇంత చిన్న వయసులో, ఇంత పెద్ద పుస్తకాలు నిజంగా నువ్వే రాసావా ..? అని అనుమానం వ్యక్తం చేశాడట. ఇక ఆయనే మధుసూదన్ రావు. ఈయన అతని లో దాగి ఉన్న ఒక మంచి రైటర్ ను గుర్తించి, తనకు అసిస్టెంట్ గా పెట్టుకున్నాడు. ఇక సీనియర్ ఎన్టీఆర్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు డైరెక్టర్ వంశీ. ఇక చివరిగా భారతీరాజా దగ్గర పనిచేసి, ఆ తరువాత మంచు పల్లకి అనే సినిమా ద్వారా డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యాడు.