టాలీవుడ్ యంగ్
హీరో కార్తికేయ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో
కార్తికేయ కు జంటగా
పాయల్ రాజ్ పుత్ నటించింది .ఈ
సినిమా మంచి విజయం సాధించడంతో ఈ
హీరో కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అందులో భాగంగా హిప్పి ,
గుణ 369 , 90 ఎం ఎల్ సినిమాలో నటించాడు. వీటిలో 'గుణ 369'
సినిమా పర్వాలేదు అనిపించుకుంది .మిగతా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.
కార్తికేయ నుంచి చివరగా వచ్చిన
సినిమా 'చావు కబురు చల్లగా' ఈ
సినిమా చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం ఈ
హీరో చిరంజీవి హీరోగా నటించి 1990 లో విడుదలైన 'రాజా విక్రమార్క'
సినిమా పేరును తన
సినిమా పేరు గా పెట్టుకున్నాడు.
శ్రీ సరిపల్లి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ మధ్య విడుదల చేసిన
సినిమా ఫస్ట్ లుక్
పోస్టర్ కు మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా తాజాగా బక్రీద్ సందర్భంగా మరొక పోస్టర్ను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన ఈ
పోస్టర్ లో
కార్తికేయ ముస్లిం వేషధారణలో లో ఉన్నాడు. ఇప్పటి వరకు చిత్ర బృందం విడుదల చేసిన
పోస్టర్ ని బట్టి చూస్తే ఇదొక కొత్త రకం స్టోరీ లా అనిపిస్తుంది.
ఈ సినిమాను 'శ్రీ చిత్ర
మూవీ మేకర్స్' బ్యానర్ పై మొదటి సినిమాగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు
ప్రశాంత్ ఆర్ విహారి స్వరాలు సమకూరుస్తూ ఉండగా రామిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కన్నడలో స్టార్
హీరో అయినా రవిచంద్రన్ మనవరాలు తాన్య రవిచంద్ర ఈ సినిమాలో
హీరోయిన్ గా నటిస్తుంది.
తనికెళ్ల భరణి ,సాయి
కుమార్ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ
సినిమా కార్తికేయ కు ఎలాంటి
సక్సెస్ ను తెచ్చిపెడుతుందో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.