ప్రముఖ నిర్మాణ సంస్థలో రౌడీ హీరో పెట్టుబడులు..
ఇప్పటికే ఈ బ్యానర్ పై 'మీకు మాత్రమే చెప్తా' సినిమాను నిర్మించి సినీ పెద్దల మన్నలను పొందాడు. ఆ తర్వాత ఇప్పుడు తన తమ్ముడు ఆనంద దేవరకొండ ప్రధాన పాత్రలో 'పుష్పక విమానం' మూవీని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు మరో స్టార్ హీరో చిత్రానికి విజయ్ పరోక్షంగా భాగం కానున్నారని తెలుస్తోంది. ఓ సూపర్ హీరో సినిమాకి ప్రముఖ నిర్మాణ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయ్యారట మన యూనివర్సల్ ఫేమస్ లవర్. సొంత నిర్మాణ సంస్థ ఉన్నప్పటికీ వేరే నిర్మాణ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారట విజయ్.
అయితే ఈ విషయం గురించి ఇంకా ఎటువంటి అఫిషియల్ అన్నౌస్మెంట్ రాలేదు. కానీ ఈ వార్త నిజమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. చేతికందిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే సిద్దాంతాన్ని బాగా ఫాలో అవుతున్నట్లు ఉన్నారు లైగర్ హీరో విజయ్ దేవరకొండ. మరి ఇలా కూడా సక్సెస్ అవుతడా ? అన్నది చూడాల్సి అవసరం ఉంది.