సాధారణంగా టీనేజ్ లో ఉన్న వాళ్ల మధ్య లవ్ కామన్. దాదాపు 90శాతం ఏదో ఒక సమయంలో ప్రేమలో పడిన వారే ఉంటారు. కొందరు లవ్ ఎక్స్ ప్రెస్ చేేసే విషయంలో ఆలస్యం చేసి ప్రేమను పొందలేని వారుంటారు. ఇంకొందరు తల్లిదండ్రులకు బయపడి మధ్యలోనే లవ్ కు ఫుల్ స్టాప్ పెట్టిన వారు కూడా ఉంటారు. ఒక అమ్మాయి.. అబ్బాయి కాస్త క్లోజ్ గా మూవ్ అయితే అంది ఏంటో అర్థం చేసుకోవడం చాలా కష్టం. అది లవ్ అనాలా.. స్నేహం అనాలో తెలియక చూసిన వారు సతమతమవుతుంటారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఇవి కామన్ అయిపోయాయి. ఇంకొందరు అయితే స్నేహం పేరుతో సహజీవనం చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా సారా అలీఖాన్ గురించే ఇప్పుడుదంతా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే రెండు సార్లు ప్రేమలో విహరించి., బ్రేక్ చెప్పిన ఈ అమ్మడు.. మళ్లీ లవ్ లో మునిగితేలుతుందనే ప్రచారం ఊపందుకుంది.
సారా అలీ ఖాన్ 'కేదార్నాథ్' సినిమాతో హీరోయిన్గా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ మూవీ సమయంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో సారా లవ్‌లో పడిందనే ప్రచారం జరిగింది. ఇద్దరూ బ్యాంకాక్ వెకేషన్‌కి కూడా వెళ్లారని సుశాంత్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి కూడా ఇప్పటికే చెప్పింది. అయితే సారా ఎప్పుడూ సుశాంత్ తో తన సంబంధం గురించి ఎప్పుడూ బయటకు చెప్పలేదు.
'లవ్ ఆజ్ కల్' సినిమా టైమ్‌లో సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్ లవ్‌లో ఉన్నారని ముంబయి మొత్తం కోడై కూసింది. బాలీవుడ్ స్టార్స్ కూడా సారా పేరుతో కార్తీక్‌పై పంచ్లేసేవాళ్లు. అయితే కొన్నాళ్ల తర్వాత సారా, కార్తీక్ విడిపోయారని, కార్తీక్ జాన్వీతో క్లోజ్ అయ్యాడనే మాటలు వినిపించాయి. ఇక ఇప్పుడు సారా, 'కేధార్నాథ్' అసిస్టెంట్ డైరెక్టర్ జహాన్ హండాతో లవ్‌లో ఉందనే టాక్ వినిపిస్తోంది.
జహాన్ హండా ఎఫైర్ గురించి సారా అలీ ఖాన్ ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు. జహాన్ కూడా బాలీవుడ్ ప్రచారంపై అవునని గానీ, కాదని గానీ చెప్పలేదు. అయితే వీళ్లిద్దరు కలిసున్న ఫోటోస్ మాత్రం వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోస్‌కి ఉన్న లవ్ సింబల్స్, టేక్ మీ బ్యాక్ లాంటి క్యాప్షన్స్ చూసి ఇద్దరూ లవ్‌లో ఉన్నారని కన్ఫర్మ్ చేస్తున్నారు నెటిజన్లు.