కృతిశెట్టి... ఇపుడు టాలీవుడ్ ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే ఆమె అందం, అభినయం చూపించాల్సిందంతా చూపించేసింది. ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూత్ ఈ అమ్మడు మాయలో పడిపోయారు. ఒకే ఒక్క సినిమాతో కుర్రకారులో గిలిగింతలు పెట్టింది కృతి శెట్టి. ఆమె సినిమాలు ఎన్ని సార్లు చూశారో తెలియదు కానీ.. ఫోన్లలో వాల్ పేపర్ గా పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక పలు షాపింగ్ మాల్స్ కృతి శెట్టిని ఓపెనింగ్ లకు పిలిచేస్తున్నాయి. తమ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా.. ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కృతి శెట్టికి మార్కెట్ లో ఎంత డిమాండ్ ఉందో. దీంతో కృతికి వరుస పెట్టి ఆఫర్లు వస్తున్నాయి. యంగ్ హీరోలంతా ఈమెనే కోరుకుంటున్నారు. దీంతో టాలీవుడ్ లోస్టార్ హీరోయిన్ గా మారుతోంది కృతి శెట్టి.
'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను బాగా మెప్పించింది కృతిశెట్టి . ఆమెలో ఉన్న నటననంతా విప్పి చూపించేసింది. ఈ సినిమా థియేటర్ల నుంచి వెళ్లిపోయినా చాన్నాళ్లైనా, యూత్ మాత్రం బేబమ్మ నామస్మరణలోనే ఉన్నారు. అలాగే టాలీవుడ్ స్టార్స్ కూడా కృతి మాయ నుంచి బయటపడలేకపోతున్నారు. బైలింగ్వల్స్ నుంచి మొదలుపెడితే మల్టీస్టారర్స్ వరకు అన్ని సినిమాల్లో కృతికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి.
కృతి శెట్టి ఇప్పటికే మల్టిపుల్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. రామ్- లింగుసామి కాంబినేషన్‌లో వస్తోన్న బైలింగ్వల్ మూవీకి సైన్ చేసింది. అలాగే నాని 'శ్యామ్ సింగారాయ్'లో ఒక హీరోయిన్‌గా నటిస్తోంది. వీటితో పాటు సుధీర్ బాబుతో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమా చేస్తోంది.
కృతి శెట్టి నెక్ట్స్ 'సోగ్గాడే చిన్ని నాయనా' ప్రీక్వెల్ బంగార్రాజులో కూడా నటిస్తోందని సమాచారం. నాగార్జున, నాగచైతన్య హీరోలుగా వస్తోన్న ఈ సినిమాలో చై జోడీగా నటిస్తోందట కృతి శెట్టి. అలాగే ఎడిటర్ నుంచి డైరెక్టర్‌గా మారిన ఎస్.ఆర్.శేఖర్ డైరెక్షన్‌లో నితిన్ ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రానికి కృతి శెట్టిని హీరోయిన్‌గా తీసుకుంటున్నారట.