ఈ నాలుగు భాషల రీమేక్ సినిమా ఎన్నాళ్ళు చేస్తారు?

P.Nishanth Kumar
ఇటీవల కాలంలో ఒక భాషలో హిట్ అయిన సినిమా మరో భాషలో రీమేక్ చేయడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. తమ నేటివిటీ తగ్గట్లుగా సినిమాకు కొంత మార్పులు చేసి అక్కడ ప్రధాన తారాగణంతో సినిమా చేసి హిట్ సాధించి మంచి లాభాలను అందుకుంటున్నారు నిర్మాతలు. ఈ విధంగా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన క్వీన్ సినిమా ఒకేసారి నాలుగు భాషలలో రీమేక్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అయిన ఈ చిత్రం సౌత్ లో కూడా తప్పకుండా వర్కౌట్ అవుతుందని నిర్మాతలు భావించి ఈ సినిమాను చాలా సంవత్సరాల క్రితం మొదలుపెట్టారు.

తెలుగులో తమన్నా, తమిళ్ లో కాజల్, మలయాళంలో మంజిమ మోహన్, కన్నడలో పరుల్ యాదవ్ వంటి నలుగురు స్టార్ హీరోయిన్ లతో ఈ సినిమాను నలుగురు దర్శకులతో ఒకేసారి మొదలు పెట్టారు. అయితే మొదలైన ఇన్ని సంవత్సరాలు అవుతున్న ఈ సినిమా ఇంకా ముందుకు కదలక పోవడంతో ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా గురించి ఈ హీరోయిన్ లని అడిగినా కూడా వారు స్కిప్ చేస్తుండటం తో ఈ సినిమా ఆగిపోయింది ఈ వార్తలకు బలం చేకూరుస్తుంది.

వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినా కూడా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే ఆగిపోయింది. దానికి కారణం బిజినెస్ కాకపోవడమే నట. థియేటర్లలో విడుదల చేయడానికి సరైన బిజినెస్ జరగలేదని అప్పట్లో వార్తలు ప్రచారం జరిగాయి. అందువల్లే ఈ సినిమాను హోల్డ్ లో పెట్టాలని ఓ టీ టీ లో మంచి డిమాండ్ వస్తే సినిమా నీ అమ్మేయాలని నిర్మాత నిర్ణయించుకున్నారట. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓ టీ టీ సంస్థలు కూడా ఈ సినిమాను  కొనేందుకు ఇష్టపడడం లేదట. వీరు చెప్పే రేటు మేకర్స్ చెప్పే రేటుకి ఎక్కడ పొంతన లేకపోవడంతో దీనిపై ఎటువంటి క్లారిటీ ఎవరికీ రావట్లేదు. మరి ఈ సినిమా ప్రేక్షకుల మరిచిపోకముందే ఏదో ఒకటి చేసి సినిమాను విడుదల చేస్తే మంచిదని సినిమా విశ్లేషకులు నిర్మాతలకు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: